రోజు రోజుకు విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ఓ కొత్త సమస్య తీవ్ర రూపం దాల్చే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రకృతిని తక్కువ అంచనా వేస్తున్న ప్రజలకు… త్వరలో చుక్కలు కనపడనున్నాయి. కాంక్రీట్ జంగిల్ లో చుక్క నీటి కోసం అలమటించిపోయే పరిస్థితి రానుంది. హైదరాబాద్ మహానగరంలో ప్రమాద స్థాయిలో పడిపోయిన భూగర్భ జలాలు ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా కలవరపెడుతున్నాయి. జలమండలి నిపుణుల బృందం చేసిన సర్వేలో వెల్లడైన వాస్తవాలు సంచలనంగా మారాయి.
Also Read: బెట్టింగ్ యాప్స్.. బయటకు వస్తున్న మోసగాళ్ళు..!
హైదరాబాద్ లోని నార్త్, వెస్ట్ లో లోని 921 చదరపు కిలోమీటర్లలో ప్రమాద స్థాయిలో భూగర్భ జలాలు అడుగంటాయి. కేవలం 27 చదరపు కిలోమీటర్ల మాత్రమే భూగర్భ నీటిమట్టం ఆశాజనకంగా కనపడుతోంది. హైటెక్ సిటీ నుండి బంజారాహిల్స్ వరకు శేర్లింగంపల్లి నుంచి కూకట్పల్లి వరకు డేంజర్ లెవెల్ కి భూగర్భ నీటిమట్టం చేరుకుంది. గతంలో ఎన్నడు లేని విధంగా హైదరాబాదులో వాటర్ ట్యాంకులు వాడకం రికార్డులు క్రియేట్ చేసింది. 100% అదనంగా వాటర్ ట్యాంకుల వినియోగం పెరిగింది. రోజుకు 11 వేల ట్యాంకర్లు సప్లై చేస్తున్నారు అధికారులు
Also Read: నాగబాబుకు షాక్ తప్పదా..?
ఇప్పటివరకు నాలుగు లక్షల 50 వేల టాంకర్లు వేసవిలో సప్లై చేసినట్లు రికార్డులు చెప్తున్నాయి. విచిత్రంగా ఇందులో నాలుగు లక్షల ట్యాంకర్లు కేవలం 22,000 మంది రిపీటెడ్ గా బుక్ చేసుకున్నట్లుగా రికార్డులలో పేర్కొన్నారు. వీరంతా కూడా హైటెక్ సిటీ, కూకట్పల్లి, శేర్లింగంపల్లి, మాదాపూర్ ప్రాంతాల్లో వారిగా గుర్తించారు. గత ఏడాది కంటే ఏడాది వర్షపాతం అధికంగా నమోదైనప్పటికీ ఎక్కడ కూడా వర్షపు నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేదని అధికారులు తేల్చి చెప్పారు. అభివృద్ధి పేరుతో వేసిన సిమెంట్ టాపింగ్స్ తో పాటు చాలా చోట్ల 100 గజాల్లో ఐదు నుంచి ఎనిమిది అంతస్తులు కట్టి ఒక్కో దాంట్లో 50 మంది నివాసం ఉంటున్నట్లుగా అధికారులు గుర్తించారు.

