Sunday, March 22, 2026 04:58 AM
Sunday, March 22, 2026 04:58 AM

పాక్ ఆదేశాలతోనే వాటర్ ట్యాంకుల్లో విషం.. హైదరాబాద్ ఉగ్రకోణంలో సంచలనం

భారత్ లో క్రమంగా పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎప్పటికప్పుడు నిఘా వర్గాలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న వారిని అదుపులోకి తీసుకుంటున్నా సరే.. చాప కింద నీరులా ఉగ్రవాదులు విస్తరిస్తూనే ఉన్నారు. ఈ విషయం తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడులతో రుజువు అయింది. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల సంఖ్య పెరుగుతున్నట్లు కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. దీనితో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ వస్తోంది.

Also Read : చెవిలో ఇయర్ బడ్స్ పెట్టొద్దు.. మరి ఎలా శుభ్రం చేసుకోవాలి..?

ఈ సమయంలో బయటికి వచ్చిన ఓ వార్త సంచలనమైంది. ఇటీవల హైదరాబాదులో ఎంబిబిఎస్ చదివిన డాక్టర్ మొయినుద్దీన్ ను రాజేంద్రనగర్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అతనిని అదుపులోకి తీసుకుంది. అతన్ని విచారిస్తున్న క్రమంలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భారీ మొత్తంలో విష ప్రయోగం చేసి చంపాలని అతను కుట్ర పన్నినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే రెసిన్ అనే విషయాన్ని అతను తయారు చేస్తున్నట్లు తేల్చారు. భారీ మొత్తంలో దీన్ని తయారు చేసి.. దేవాలయాలు, వాటర్ ట్యాంకులలో కలిపేసి సామూహిక విష ప్రయోగం చేయాలని కుట్ర పన్నినట్లు వెళ్లడైంది.

Also Read : జోగి దందాలు.. సంచలనం దిశగా పోలీసులు..!

అతని వద్ద నుంచి భారీగా విషాన్ని తయారు చేసే పదార్థాలను గుర్తించారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆదేశాలతోనే ఈ పదార్థాన్ని తాను తయారు చేస్తున్నట్లు డాక్టర్ మొయినుద్దీన్ అంగీకరించాడు. ఇప్పటికే డాక్టర్ మొయినుద్దీన్ తో పాటుగా నలుగురిని అరెస్టు చేసి గుజరాత్ ఏటిఎస్ స్క్వాడ్ విచారిస్తోంది. చైనాలో ఎంబిబిఎస్ చదివి హైదరాబాద్ వచ్చిన డాక్టర్ మొయినుద్దీన్ ఆన్లైన్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నాడు. రోడ్లమీద తక్కువ తిరిగే ఇతను.. ఇంట్లోనే ఎక్కువగా ఉంటాడని, తనకు అవసరమైన సరుకులను ఆన్లైన్ ద్వారానే ఆర్డర్ చేసుకుంటూ ఉంటాడని గుర్తించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్