Monday, March 23, 2026 12:47 AM
Monday, March 23, 2026 12:47 AM

హిట్ లిస్టులో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై.. ప్లాన్ అదేనా..?

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల విషయంలో దర్యాప్తు సంస్థలు వేగం పెంచాయి. దేశంలో చాన్నాళ్ల తర్వాత జరిగిన బాంబు పేలుళ్లు కావడంతో దర్యాప్తు సంస్థలు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఇటీవల ఉత్తరాది రాష్ట్రాల్లో దొరికిన కొందరు ఉగ్రవాద సానుభూతిపరుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా పెద్ద ఎత్తున సోదాలు జరుపుతున్నాయి. ఢిల్లీ బాంబు పేలుళ్లకు.. జమ్మూ కాశ్మీర్ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందినట్లు కూడా గుర్తించారు. ఇక ఈ దాడికి పాల్పడిన ఉమర్ అనే డాక్టర్ డీఎన్ఏ కూడా అతని తల్లితో సరిపడినట్లు వెల్లడించారు.

Also Read : వైసీపీలో కలకలం.. అప్రూవర్‌గా ధర్మారెడ్డి..!

ఇదే సమయంలో ఆసక్తికర విషయాలను జాతీయ దర్యాప్తు సంస్థలు బయటపెట్టాయి. దేశవ్యాప్తంగా భారీగా బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు గుర్తించారు. కేవలం దేశ రాజధాని లోనే నాలుగు ప్రాంతాల్లో బాంబులు పేల్చాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు వెల్లడైంది. అన్నిచోట్ల కూడా ఆత్మహత్య దాడులే ప్రణాళిక అని.. అందుకోసమే భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను సేకరించారని గుర్తించారు. ఆర్థికంగా కూడా ఉగ్రవాదులకు ఎటువంటి సమస్యలు లేకుండా.. కొందరు సహకరించినట్లు కూడా దర్యాప్తు బృందాలు తమ విచారణలో గుర్తించాయి.

Also Read : విశాఖలో ఐటి కంపెనీల జాతర

ఈ పేలుళ్లకు మొత్తం ఎనిమిది మంది కుట్ర చేశారని.. ఒక్కో గ్రూప్ లో ఇద్దరు ఉండి దాడుల ప్రణాళికను అమలు చేస్తున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా మొత్తం నాలుగు నగరాల్లో ఈ తరహా దాడులు ప్లాన్ చేసినట్లు కూడా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా దక్షిణాదిలో కీలక నగరాలైన హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో దాడులకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు గుర్తించారు. అటు జమ్మూ కాశ్మీర్ లోని సరిహద్దు ప్రాంతాల్లో కూడా మరిన్ని దాడులకు ప్రణాళికలు రచించినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే అక్కడి భద్రతా బలగాలు పెద్ద ఎత్తున జమ్మూ కాశ్మీర్లో సోదాలు జరుపుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్