Wednesday, February 4, 2026 11:13 AM
Wednesday, February 4, 2026 11:13 AM

గుంటూరులో వైసీపీ భారీ అవినీతి.. కోపరేటివ్ బ్యాంక్ చరిత్రలోనే..!

కవితకు కాదేది అనర్హం అన్నట్లు.. అవినీతికి కాదేది అనర్హం అన్నట్టు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని అవినీతి కార్యక్రమాలు స్పష్టం చేసాయి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోచుకునే కార్యక్రమాలకు వైసీపీ నేతలు శ్రీకారం చుట్టారు అనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. ప్రభుత్వ సొమ్మును వైసీపీ నేతలు దోచుకున్నారనే అంశంలో వెలుగులోకి వస్తున్న విషయాలు ఆశ్చర్య పరుస్తున్నాయి. తాజాగా సహకార బ్యాంకులలో జరిగిన కుంభకోణం అత్యంత సంచలనం అయింది.

Also read : బ్రేకింగ్: మోగనున్న స్థానిక ఎన్నికల నగారా..?

ఉమ్మడి గుంటూరు జిల్లాలో.. వైసీపీ హయాంలో సహకార బ్యాంకుల్లో భారీ కుంభకోణం జరిగినట్లు వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి. కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ చరిత్రలో గుంటూరు జిల్లా నల్లపాడు సహకార బ్యాంకులో భారీ స్కాం జరిగినట్లు తాజాగా వెల్లడి అయింది. కోట్లాది రూపాయలను వైసీపీ నేతలు దోచుకున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై విచారణ చేపట్టగా.. లక్షలాది డ్వాక్రా మహిళలను మోసగించి నిలువు దోపిడీకి పాల్పడ్డారని గుర్తించారు. ‘జగనన్న మహిళా ధీమా పథకం’ పేరుతో ఎక్కడికక్కడ కోట్లాది రూపాయల స్కాం చేసినట్టు తేల్చారు.

Also read : హిడ్మాకు సోషల్ మీడియాలో షాకింగ్ క్రేజ్.. వైరల్ అవుతోన్న తల్లి దీన స్థితి..!

సహకార బ్యాంకు నల్లపాడు శాఖలో అక్రమాలపై తాజాగా విచారణ జరగగా.. ఒక్క గుంటూరు నల్లపాడు సహకార బ్యాంకు శాఖలోనే బోగస్‌ రుణాలతో రూ.22.25 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు తమ విచారణలో గుర్తించారు. బాధ్యులైన ఉద్యోగులపై సెక్షన్‌ 59 ప్రకారం చర్యలకు ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాలతో అత్యవసరంగా బ్యాంకు పాలక వర్గం సమావేశం అయింది. జీఎంలు కృష్ణవేణి, అజయ్‌కిశోర్‌ను సస్పెండ్‌ చేస్తూ బ్యాంకు పాలకవర్గం తీర్మానం చేసింది. 796 మందిపై సివిల్‌, 186 మందిపై క్రిమినల్‌ చర్యలకు, 27 మందిపై క్రమశిక్షణ చర్యలకు బ్యాంకు పాలకవర్గం తీర్మానించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

పోల్స్