Monday, March 23, 2026 04:22 AM
Monday, March 23, 2026 04:22 AM

పెట్టుబడుల్లో ఏపీ దూకుడు.. రికార్డ్ స్థాయిలో ఒప్పందాలు..!

రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్న సిఎం చంద్రబాబు.. విశాఖలో జరుగుతోన్న పెట్టుబడుల సదస్సుపై సీరియస్ ఫోకస్ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒప్పందాలు కూడా కుదుర్చుకునే ప్రయత్నం చేస్తోంది. 400 ఎంఓయూలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోవడం గమనార్హం. దీని ద్వారా రూ. 11,91,972 కోట్ల పెట్టుబడులు, 13,32,445 ఉద్యోగాలు రానున్నాయి. ఇక తాజాగా విశాఖ- 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు నుంచి రేమాండ్ ప్రాజెక్టులకు వర్చువల్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసారు.

Also Read : కర్మ హిట్స్ బ్యాక్.. కవిత సంచలన కామెంట్స్

ఈ కార్యక్రమానికి రేమాండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ మైనీ, ఆ సంస్థ కార్పోరేట్ డెవలప్మెంట్ హెడ్ జతిన్ ఖన్నా హాజరు అయ్యారు. రూ.1201 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో మూడు ప్రాజెక్టులు రేమాండ్ ఏర్పాటు చేయనుంది. సిల్వర్ స్పార్క్ అప్పారెల్, జేకే మైనీ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్, జేకే మైనీ గ్లోబల్ ప్రెసిషన్ లిమిటెడ్ యూనిట్లకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేసారు. రాప్తాడులో రూ.497 కోట్ల వ్యయంతో సిల్వర్ స్పార్క్ అప్పారెల్ మాన్యుఫాక్చరింగ్ పార్క్ ను ఏర్పాటు చేస్తోంది.

Also Read : విశాఖలో ఐటి కంపెనీల జాతర

అనంతపురం జిల్లా గుడిపల్లిలో రూ.441 కోట్లతో ఆటో కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ను రేమాండ్ గ్రూప్ ఏర్పాటు చేస్తోంది. అనంతపురం జిల్లా టెకులోదు వద్ద రూ.262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ ను రేమాండ్ గ్రూప్ ఏర్పాటు చేస్తోంది. మొత్తంగా రూ.1201 కోట్ల పెట్టుబడులతో మూడు వేర్వేరు పరిశ్రమల ఏర్పాటు ద్వారా 6500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలను ఈ సంస్థ కల్పించనుంది. ఇదే సమయంలో విదేశీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఏవియేషన్, విద్యుత్, మౌలిక సదుపాయాలు, మారిటైమ్, మైనింగ్, టెక్నాలజీ రంగాలలో విస్తృతమైన గ్లోబల్ పోర్ట్‌ఫోలియో కలిగిన యూఎస్ఏ-ఆధారిత మల్టీ నేషనల్ కంపెనీ కార్బోనాటిక్ కూడా 31 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్