రాష్ట్రంలో పలు కార్పొరేషన్ల రాజకీయం ఆసక్తిని రేపుతోంది. కడప మేయర్ అంశానికి సంబంధించి ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కొత్త మేయర్ గా పాక సురేష్ ను వైసిపి ఎంపిక చేసింది. దీంతో అక్కడ కొంత ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇక తాజాగా నెల్లూరు కార్పొరేషన్ వ్యవహారం జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా సంచలనమైంది. మేయర్ పొట్లూరి స్రవంతి పై డిసెంబర్ 18న అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు టిడిపి కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. వైసిపి కార్పొరేటర్లు కూడా కొంతమంది ఆమె విషయంలో అసంతృప్తిగా ఉన్నారు అనే వార్తలు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.
Also Read : లోకేష్ కమిట్మెంట్ కు షాక్ అయిన టీడీపీ నేతలు
ఇక ఇప్పుడు ఆమెకు వ్యతిరేకంగా ఉన్న కార్పొరేటర్లు టిడిపిలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో జరుగుతున్న పరిణామాలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా 35 మంది కార్పొరేటర్ లను గోవా క్యాంపుకు టిడిపి తరలించింది. నెల్లూరు రూరల్ క్యాంప్ కార్యాలయం నుంచి టెంపుల్ కార్పొరేటర్లను తరలించారు. ఈ వ్యవహారం మొత్తాన్ని దగ్గరుండి కోటంరెడ్డి బ్రదర్స్ పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 10, 11 తేదీల్లో నెల్లూరు సిటీ, రూరల్ కార్పొరేషన్ లోని ఐదుగురు కార్పొరేటర్లు వైయస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీని వెనక స్థానిక వైసీపీ నేతలు ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.
Also Read : దురంధర్ ను భయపెడుతున్న అఖండ..?
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఇవి జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఓబుల రవిచంద్ర, మద్దినేని మస్తానమ్మ కుమారుడు శ్రీధర్ వైసీపీ నుంచి నేడు మళ్లీ టిడిపిలో జాయిన్ అయ్యారు. ఎలాగైనా సరే ఈ స్థానాన్ని కాపాడుకోవాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఈ పరిణామం గొంతులో వెలక్కాయ పడ్డయింది. ఇక టిడిపి నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రంగంలోకి దిగడంతో.. కార్పొరేషన్ రాజకీయం మరింత ఉత్కంఠ గా మారింది. అటు మంత్రి నారాయణ కూడా ఎలాగైనా సరే నెల్లూరు కార్పొరేషన్ చేజెక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈనెల 18న అవిశ్వాస తీర్మానం ఉన్న నేపథ్యంలో అటు వైసీపీ అధిష్టానం కూడా ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోంది.

