Sunday, October 26, 2025 02:51 AM
Sunday, October 26, 2025 02:51 AM
roots

ఏ క్షణమైనా పిన్నెల్లి బ్రదర్స్ అరెస్ట్.. షాక్ ఇచ్చిన హైకోర్ట్

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్ల నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామి రెడ్డి, వారి ప్రధాన అనుచరుడు తురక కిషోర్ చేసిన ఆగడాలు అన్నీ ఇన్నీ కాదు. వైసీపీ అధిష్టానం మద్దతు ఉండటం, మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అండదండలు పుష్కలంగా ఉండటంతో పిన్నెల్లి బ్రదర్స్ అండ్ కో ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండేది వాతావరణం. అయితే వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత వారికి గడ్డు కాలం నడుస్తోంది.

Also Read : ఆ విషయంలో వైసీపీ స్టాండ్ మారిందా..?

గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కూడా పిన్నెల్లి బ్రదర్స్ ఆగడాలు కొనసాగాయి. టీడీపీ కార్యకర్తలను, తమకు ఎదురు తిరిగిన వారిని పిన్నెల్లి బ్రదర్స్.. ఎన్నో రకాలుగా వేధింపులకు గురి చేసారు. ఈ క్రమంలో కొందరిని కూనీలు కూడా చేసారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా వీరి ఆగడాలు సైలెంట్ గా కొనసాగాయి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం ముదిలవీడు సమీపంలో జరిగిన జంట కూనీలు సంచలనం అయ్యాయి. జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు కూనీల కేసులో పిన్నెల్లి సోదరులు నిందితులుగా పోలీసులు గుర్తించారు.

Also Read : ఎన్టీఆర్ విత్ నీల్.. మరో ఇద్దరు స్టార్ హీరోలు.. ?

ఈ కేసులో ఏ6 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7 వెంకట్రామిరెడ్డి అని పోలీసులు స్పష్టం చేసారు. ఘటనలో పాల్గొన్న వ్యక్తులతో పిన్నెల్లి సోదరులు ఫోన్లో మాట్లాడారని అభియోగం మోపడమే కాకుండా అందుకు సాక్ష్యాలను కూడా సేకరించారు. తాజాగా హైకోర్ట్ లో పిన్నెల్లి సోదరులు ముందస్తు బెయిల్ పిటీషన్ వేయగా దానిని కోర్ట్ కొట్టేసింది. వారు ఫోన్ లో మాట్లాడినట్లు కాల్స్‌ రికార్డులు ఉన్నాయని ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ కోర్ట్ ముందు వాదనలు వినిపించారు. పిన్నెల్లి సోదరులకు నేర చరిత్ర ఉందని హైకోర్టులో దమ్మాలపాటి కోర్టుకు వివరించారు. ముందస్తు బెయిల్‌ ఇస్తే సాక్షులను బెదిరిస్తారని పోలీసుల తరఫున వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలను విన్న కోర్ట్.. పిటీషన్ కొట్టేసింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

సస్పెండ్ చేస్తే తిరువూరు...

తిరువూరు నియోజకవర్గం టీడీపీలో అలజడి కొనసాగుతోంది....

పులివెందులకు కేంద్రం గుడ్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

వరల్డ్ కప్‌కు మేం...

గత నాలుగు నెలల నుంచి భారత...

రోహిత్ రికార్డుల మోత.....

భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా ఓపెనర్...

ఒక్కొక్కరికి కోటి ఇచ్చే...

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాతి...

హైడ్రా కమీషనర్ రంగనాథ్...

హైదరాబాద్‌లోని హైడ్రా కమీషనర్ రంగనాథ్ శుక్రవారం...

పోల్స్