Sunday, March 22, 2026 08:29 AM
Sunday, March 22, 2026 08:29 AM

హైకోర్టులో వర్మకి భారీ ఊరట

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత కొన్నాళ్ళుగా తప్పించుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. పలు స్టేషన్లలో వర్మపై కేసులు నమోదు అయినా సరే ఆయన విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. ఏపీ పోలీసులు ఆయన ఇంటి వద్దకు వెళ్ళినా వర్మ మాత్రం దొరకలేదు. తర్వాత వీడియోలు విడుదల చేసి పోలీసులకు షాక్ ఇచ్చారు. అలాగే సోషల్ మీడియాలో పలు పోస్ట్ లు పెడుతూ సవాల్ చేసాడు వర్మ. అలాగే తనపై పెట్టిన కేసులకు చట్టాలు వర్తించవు అంటూ కేసు నంబర్లను కూడా అక్కడ రాసుకొచ్చాడు.

Also Read : జగన్ బెయిల్ రద్దు కేసులో కీలక ముందడుగు

ఇదే సమయంలో పలు న్యూస్ చానల్స్ కు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు వర్మ. అసలు అరెస్ట్ చేస్తారా లేదా అనుకుంటున్న టైం లో ఏపీ హైకోర్ట్ పోలీసులకు షాక్ ఇచ్చింది. హైకోర్టులో రాం గోపాల్ వర్మకు ఊరట లభించింది. రామ్ గోపాల్ వర్మ కేసులో… వచ్చే సోమవారం వరకు ఏ చర్యలు తీసుకోవద్దని హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు.. రిట్ పిటిషన్ పై వచ్చే సోమవారం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం న్యాయవాదిని కోర్ట్ ఆదేశించింది.

Also Read : తెలంగాణాలో టీడీపీ గేమ్ స్టార్ట్

సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు, ఫోటో మార్ఫింగ్ పోస్టులు చేశారంటూ వర్మపై ముందు మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వర్మపై రాష్ట్ర వ్యాప్తంగా మూడు జిల్లాల పరిధిలో పలు స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. ఇదే కేసులో హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రామ్ గోపాల్ వర్మ… తాను ఎక్కడ ఉన్నదీ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. కాగా తాను తన ఆఫీస్ లోనే ఉన్నా అంటూ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్