Sunday, March 22, 2026 04:00 AM
Sunday, March 22, 2026 04:00 AM

పచ్చి తులసి ఆకులు తింటే ఇన్ని లాభాలా..?

ఉచితంగా దొరికే వాటికంటే ఖర్చు చేస్తే దొరికే వాటికే ప్రజలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇదే నిజం. ఉచితంగా దొరికే వాటిని తీసిపడేస్తూ ఉంటారు. అందులో తులసి ఆకులు కూడా ఒకటి. తులసి ఆకుల ప్రయోజనాలు మాత్రం.. సహజంగా మన ఆరోగ్యాన్ని కాపాడేవే. వాటిని తక్కువ అంచనా వేసి చాలా మంది లైట్ తీసుకుంటారు. పచ్చి తులసి ఆకులను క్రమం తప్పకుండా తింటే మాత్రం చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుందని, శ్వాసకోశ సంబంధిత సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని సూచిస్తున్నారు వైద్యులు.

Also Read : లిక్కర్ స్కామ్.. భారతీ అరెస్టు తప్పదా..?

మానసిక ఒత్తిడిని కూడా కంట్రోల్ చేస్తుందని సూచిస్తున్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి సంస్థలు నివారణ ఆరోగ్య సంరక్షణలో తులసి వంటి సాంప్రదాయ మూలికల పాత్రను గుర్తించాయి. ప్రతిరోజూ కొన్ని తులసి ఆకులను తినడం శరీరానికి మంచిదని సూచిస్తున్నారు. తులసి ఆకులు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పరిగణించేవారు పూర్వం. యూజినాల్, ఉర్సోలిక్ ఆమ్లం, రోస్మరినిక్ ఆమ్లం వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు ఈ ఆకుల్లో ఉన్నాయి.

Also Read : తమ్ముడిపై కేశినేని నానీ మరో బాంబు 

ఈ సహజంగా లభించే కారకాలు.. మన శరీరానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, అడాప్టోజెనిక్ వంటిప్రభావాలను అందిస్తాయి. మీ శరీరాన్ని వివిధ వ్యాధుల నుండి కూడా రక్షిస్తాయి. ఆకులను పచ్చిగా తినడం వల్లనే ఎక్కువగా ఉపయోగాలు ఉన్నాయి. ప్రాసెస్ చేస్తే వాటిల్లో ప్రయోజనాలు తగ్గిపోతాయి. తులసిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నోటి పరిశుభ్రతకు అద్భుతంగా పని చేస్తాయి. ఈ ఆకులను నమలడం వల్ల దుర్వాసన, చిగుళ్ల ఇన్ఫెక్షన్లు మరియు నోటి పూతలు తగ్గుతాయి.

Also Read : క్వాంటం కల సాకారమవుతోందా?

తులసి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. తులసి సహజ డీకంజెస్టెంట్, ఎక్స్‌పెక్టరెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఉబ్బసం, బ్రోన్కైటిస్, సైనసిటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులకు మంచి ఔషధం. పచ్చి తులసి ఆకులను నమలడం వల్ల కఫం క్లియర్ అవుతుంది, దగ్గు తగ్గుతుంది. పచ్చి తులసి ఆకులు శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్