Wednesday, February 4, 2026 04:04 PM
Wednesday, February 4, 2026 04:04 PM

బీఆర్ఎస్ బాడీ లాంగ్వేజ్ మారిందా..?

రాజకీయాల్లో ఎత్తు పల్లాలు సహజమే కానీ.. పల్లాల్లో ఉన్నప్పుడు ఎత్తులను ఎలా అధిరోహించాలి అని తెలిసినప్పుడే భవిష్యత్తు ఉంటుంది. ఈ విషయంలో క్లారిటీ రాక గత రెండేళ్ళ నుంచి తెలంగాణా ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇబ్బంది పడుతోంది. క్షేత్ర స్థాయిలో పట్టు కోల్పోవడం, కేసీఆర్ బయటకు రాకపోవడం వంటివి కొంత ఆ పార్టీని ఇబ్బంది పెట్టింది. ఆ పార్టీని హరీష్, కేటిఆర్ ఎంత ప్రభావితం చేసినా.. కేసీఆర్ మీడియా సమావేశం లెవెల్ వేరు. ఆ పార్టీ క్షేత్ర స్థాయిలో బలపడాలన్నా, పార్టీ వాయిస్ ప్రజల్లో వినపడాలన్నా కేసీఆర్ కీలకం.

Also Read : భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..!

ఇప్పుడు ఆయన బయటకు వచ్చారు, ఇక రారు అనుకున్న కేసీఆర్.. ఒక్కసారిగా రావడం, తన రేంజ్ విమర్శలు చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. దీనితో పార్టీ నాయకుల బాడీ లాంగ్వేజ్ తో పాటుగా, నోటి భాష కూడా మారింది. తాజాగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా వరకు ఆశ్చర్యంగానే అనిపించాయి. సిఎం రేవంత్ రెడ్డిని ఏకవచనంతో పాటుగా మాట్లాడిన భాష కూడా వింతగా అనిపించింది. అటు కేసులకు కూడా తాము భయపడేది లేదనే సిగ్నల్ ఇచ్చేసారు.

Also Read : ఐటీ విప్లవం తర్వాత క్వాంటం విప్లవానికి ఏపీ నాంది

ఫార్ములా ఈ రేస్, కాళేశ్వరం వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ సహా పలు అంశాలకు సంబంధించి ప్రభుత్వ పెద్దలు దూకుడుగా వెళ్ళినా.. తాము తగ్గేది లేదనే క్లారిటీ బీఆర్ఎస్ ఇస్తోంది. సిఎం రేవంత్ రెడ్డిని మానసికంగా టార్గెట్ చేసేందుకు కూడా బీఆర్ఎస్ సిద్దమై ఉండవచ్చు అనే భావన వ్యక్తమవుతోంది. కాళేశ్వరం వ్యవహారంలో హైకోర్ట్ ఇచ్చిన తీర్పు కూడా సంచలనం అయింది. ఎల్ అండ్ టీ ఖర్చును భరించాలి అంటూ తేల్చి చెప్పింది. దీనితో భవిష్యత్తులో వచ్చే కేసుల విషయంలో కూడా తమకు ఇబ్బంది ఉండదనే భావనలో బీఆర్ఎస్ ఉండవచ్చు అనే మాట కూడా వినపడుతోంది. కేసీఆర్ ప్రజాక్షేత్రంలో దిగడంతో ప్రభుత్వంపై యుద్దానికి బీఆర్ఎస్ దిగింది అనే సంకేతాలు వచ్చేసాయి. అరెస్ట్ చేసినా తమకే ప్లస్ అనే నిర్ణయానికి గులాబీ పార్టీ వచ్చేసి ఉండవచ్చు అంటున్నాయి రాజకీయ వర్గాలు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్