Sunday, March 22, 2026 08:49 AM
Sunday, March 22, 2026 08:49 AM

ఈ ఎస్పీ పేరు చెప్తే గంజాయి బ్యాచ్ కు హడల్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ సహా ఇతర మాదక ద్రవ్యాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ ను విక్రయించారు అనే ఆరోపణలు, దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా ఏపీలో మూలాలు ఉండటం ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు సిఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీటి విషయంలో పోలీసులకు సైతం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఎక్కడికక్కడ దూకుడుగా చర్యలు చేపడుతున్నారు.

Also Read : కారు ఇంజిన్ లో కవిత మంటలు.. ఆ మాట ఎందుకు మాట్లాడినట్టు..?

ఈ విషయంలో గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. గతంలో విజయనగరం ఎస్పీగా ఉన్న సమయంలో గంజాయిపై కఠినంగా వ్యవహరించిన జిందాల్.. ఇప్పుడు గుంటూరులో కూడా అదే రేంజ్ లో చుక్కలు చూపిస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడమే కాకుండా, అనుమానాస్పద ప్రదేశాల్లో స్థానికుల సహకారంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పక్కా సమాచారం సేకరించి.. దాడులు చేయించడం గమనార్హం. రైల్వే స్టేషన్ లు, బస్టాండ్ లలో ప్రత్యేక తనిఖీలు కూడా చేపడుతున్నారు.

Also Read : పాలన అంటే ఇదే – 30 ఏళ్ల ఇఫ్కో SEZ సమస్యకు TDP ముగింపు

ముఖ్యంగా రౌడీ హిస్టరీ, రాజకీయ నాయకుల బ్యాక్ గ్రౌండ్ ఉన్న ముఠాలు, గతంలో జైళ్ళలో ఉండి వచ్చిన వారు, ఈ కేసుల్లో గతంలో అరెస్ట్ అయిన వారిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ఎస్పీ. ఏదైనా ఘటన జరిగి, ఆ ఘటనలో డ్రగ్స్ లేదా గంజాయి ముఠాల హస్తం ఉందని తెలిస్తే.. మూలాల వరకు విచారిస్తూ.. చుక్కలు చూపిస్తున్నారు ఎస్పీ. ప్రభుత్వ పెద్దల స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో ఎస్పీ మరింత దూకుడుగా పని చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తనకు నచ్చిన టీం ఏర్పాటు చేసుకున్న ఎస్పీ.. వీటికి సహకరించే అధికారులపై కూడా నిఘా పెట్టడం గమనార్హం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్