Saturday, September 13, 2025 12:42 PM
Saturday, September 13, 2025 12:42 PM
roots

జగన్ పరువును వారే తీస్తున్నారు..!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.. వైసీపీ నేతలకు హడల్. పైకి మాత్రం అందరినీ అన్నా అని అప్యాయంగా పిలుస్తారు. కానీ.. ఒక్కసారి ఆయనకు కోపం వచ్చిందంటే చాలు.. తన మన అని కూడా చూడరు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అలాంటి జగన్‌తో పార్టీ నేతలు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆయన ఏం చెబితే అదే నిజమంటారు. అంతే తప్ప మాట దాటి ముందుకు వెళ్లే ధైర్యం చేయరు. కానీ ఇప్పుడు ఇలా జగన్ మాట నిజం చేసే ప్రయత్నంలో చాలా మంది నేతలు జగన్ పరువు తీస్తున్నారు.

Also Read : ఎస్పీలపై చంద్రబాబు గురి..? కారణం అదేనా

ప్రస్తుతం ఏపీలో మెడికల్ కళాశాల వ్యవహారం రాజకీయ పార్టీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. పది మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో నిర్మించాలని ఏపీ మంత్రివర్గం తీర్మానం చేసింది. దీనిపై వైసీపీ అధినేత ఘాటు వ్యాఖ్యలు చేశారు కూడా. ఎవరైనా టెండర్లు వేస్తే.. వాటిని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాగే తాను కట్టిన మెడికల్ కాలేజీల దగ్గరకు వెళితే.. ఆహా అనాల్సిందే అని కూడా వ్యాఖ్యానించారు జగన్.

జగన్ చెప్పిన మాట నిజమే అని చెప్పేందుకు వైసీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఆ పార్టీ నేతలకే బూమ్ రాంగ్ అవుతున్నాయి. వైసీపీ హయాంలో నిర్మించినట్లు చెబుతున్న మెడికల్ కళాశాలల ఎదురుగా ఆ పార్టీ నేతలు సెల్ఫీలు దిగుతున్నారు. జగన్ ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే.. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగమేఘాల మీద అనకాపల్లి నుంచి నర్సీపట్నం వెళ్లారు. అక్కడ నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ ముందు సెల్పీ దిగారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

Also Read : తిరుమలలో అపచారమా.. వాస్తవం ఏమిటి..?

గుడివాడ అమర్నాథ్ ఫోటో చూసిన నెటిజన్లు.. ఆహా.. మూడంతస్తులు భలే కట్టారు కదా.. మరి మధ్యలో గోడలు ఏవి.. అని సెటైర్లు వేస్తున్నారు. అక్కడ ఏముందని ఫీల్డ్ విజిట్‌ చేశారు సార్.. అని కొందరు కామెంట్ చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను జగన్ పక్కదోవ పట్టించారని చెప్పకనే చెబుతున్నారు కదా.. అని వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ పరువు తీయడానికి మీలాంటి నేతలే కరెక్ట్ అని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ ఏమీ చేయలేదని మీరు రుజువు చేస్తున్నారంటున్నారు. మొత్తానికి జగన్ పరువును సొంత పార్టీ నేతలు తీస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

కేటీఆర్ కు రేవంత్...

భారత రాష్ట్ర సమితి విషయంలో ముఖ్యమంత్రి...

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

పోల్స్