Thursday, February 5, 2026 05:10 PM
Thursday, February 5, 2026 05:10 PM

అదానీ చేతిలో గూగుల్..!

గూగుల్ డేటా సెంటర్.. అదానీ చేతిలోకి వెళ్లబోతోందా..? 87 వేల కోట్ల పెట్టుబడితో గూగుల్ సంస్థ పెట్టనున్న డేటా సెంటర్‌ను తన అధీనంలోకి తెచ్చుకునేందుకు కేంద్ర అధికార పెద్దల ద్వారా రాష్ట్ర పెద్దలపై అదానీ ఒత్తిడి తెస్తున్నారనే మాట బాగా వినిపిస్తోంది. గూగుల్ స్థాపించబోయే గూగుల్ డేటా సెంటర్ అదానీ పర్యవేక్షిస్తారని.. ఇప్పటికే ప్రాంతీయ గూగుల్ సంస్థ ముఖ్య అధికారి ఒకరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది. గూగుల్ సంస్థ ముఖ్యులతో సంప్రదింపులు జరిపిన తర్వాత.. వారి ఆమోదంతోనే ప్రాంతీయ గూగుల్ ముఖ్య అధికారి ప్రభుత్వానికి లేఖ రాసారా..? అనే విషయం మాత్రం బయటకు రావటం లేదు.

Also Read : వాళ్లను ఎందుకు అరెస్టు చేయలేదన్న జగన్..!

వైసీపీ ప్రభుత్వం హయాంలో డేటా సెంటర్ స్థాపన కోసం అదానీ కంపెనీకి విశాఖపట్నంలో 350 ఎకరాల భూముల కేటాయింపు జరిగింది. కేటాయించినపుడు భూములు ఎలా ఉన్నాయో.. ఇప్పటికీ ఆ భూములు అలాగే ఉన్నాయి. ఎలాంటి మార్పులు అక్కడ కనిపించ లేదు. ఇంకా చెప్పాలంటే.. ఇంతవరకు అదానీ డేటా సెంటర్ పనులు ప్రారంభమై కాలేదు. అసలు అవుతాయనే నమ్మకం కూడా లేదు. కూటమి ప్రభుత్వం కూడా అదానీ కంపెనీకి వైసీపీ ప్రభుత్వం కేటాయించిన 350 ఎకరాల భూముల జోలికి వెళ్లటం లేదు. అయితే 87 వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ స్థాపనకు గూగుల్ సంస్థ ముందుకు వచ్చిన వెంటనే.. అప్పుడే అదానీ కళ్లు దానిపై పడినట్లు తెలుస్తోంది.

గూగుల్ డేటా సెంటర్ ప్రకటన వెంటనే.. కేంద్ర పెద్దలను కలిసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రాష్ట్ర పెద్దలతో భేటీ అయ్యారనే సమాచారం ఉంది. సుమారు 400 ఎకరాల భూములను గూగుల్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించటంతో ఆ భూముల పై కూడా అదానీ కళ్ళు పడినట్లు విమర్శలు వస్తున్నాయి. డేటా సెంటర్ స్థాపన కోసం 87 వేల కోట్ల పెట్టుబడితో గూగుల్ సంస్థతో ఒప్పందం కుదిరిందని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ గొప్పగా ప్రకటించారు. గూగుల్ డేటా సెంటర్‌కు భూముల కేటాయింపు కూడా ఆఘమేఘాల మీద జరిగిపోయింది. అయితే ఇప్పుడు వాటిని అదానీ గ్రూప్ దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.

తమకు అత్యంత సన్నిహితుడైన అదానీకి సహకరించమని కేంద్ర పెద్దలు.. కూటమి సర్కార్‌పై ఒత్తిడి తెస్తున్నారనే మాట బాగా వినిపిస్తోంది. గూగుల్ సంస్థ ప్రతినిధులతో కూడా కేంద్ర అధికార పెద్దల ద్వారా అదానీ గ్రూప్ రాయభారం నడిపినట్లు తెలుస్తోంది. అందుకే 87 వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ స్థాపిస్తామని ముందుకొచ్చిన గూగుల్ సంస్థ.. ఇప్పుడు దానిని అదానీకి అప్పగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వానికి రాసిందనేది సచివాలయ వర్గాల మాట. గూగుల్ సంస్థకు కేటాయించిన సుమారు 400 ఎకరాల్లో సగం భూముల్లో మాత్రమే డేటా సెంటర్ ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. మిగిలిన భూములను కమర్షియల్ అవసరాల కోసం వినియోగించేలా నిబంధనల్లో మార్పులు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది.

Also Read : మల్లన్న దగ్గర కూడా కల్తీ పాపాలేనా..?

వైసీపీ ప్రభుత్వంలో దక్కించుకున్న 350 ఎకరాల భూముల్లో ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభించలేదు. అయినా సరే.. నాటి జగన్ సర్కార్.. ఆ భూముల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. పైగా గూగుల్ డేటా సెంటర్ ప్రకటన వచ్చిన వెంటనే.. అది తమ హయాంలోనే జరిగినట్లు గొప్పగా ప్రకటించుకున్నారు కూడా. అంటూ గూగుల్ డేటా సెంటర్ అదానీ చేతికి వెళ్తుందని వైసీపీ నేతలకు ముందే ఎలా తెలిసిందనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.వైసీపీ ముఖ్యనేతలతో అదానీకి మంచి సంబంధాలున్నాయి. విశాఖలో అదానీ డేటా సెంటర్‌కు వైసీపీ నేతల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవనేది పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట. అదానీ పవర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం ఒత్తిడికి తలొగ్గే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దటీజ్ అదానీ పవర్ అంటున్నారు కూడా.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏ ఒక్కడినీ వదిలిపెట్టం.....

కల్తీ నెయ్యి వ్యవహారం, తిరుమల లడ్డూ...

తెలంగాణకు ఎవరు జాతిపిత..?

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా...

యాటిట్యూడ్ స్టార్‌.. “గుంజి...

సినిమా అంటే.. నలుగురు చూసేది.. అందులో...

మల్లన్న దగ్గర కూడా...

2019 నుంచి 2024 వరకు ఏపీలో...

వాళ్లను ఎందుకు అరెస్టు...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

పోల్స్