Wednesday, February 4, 2026 12:43 PM
Wednesday, February 4, 2026 12:43 PM

ట్రాఫిక్ కష్టాలకు జీహెచ్ఎంసీ ప్లాన్ అదుర్స్

హైదరాబాద్ అంటే చాలు.. బాబోయ్.. అంటున్నారు ప్రజలు. ఇందుకు ప్రధాన కారణం ట్రాఫిక్ కష్టాలు. హైదరాబాద్ నగర పరిధిలో ఇప్పటికే జనాభా సంఖ్య కోటి దాటిపోయింది. ఇక దాదాపు 30 లక్షలకుపై కార్లు, 50 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు ఇప్పటికే నగరంలో తిరుగుతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ట్రాఫిక్ జామ్ లేకుండా ఎన్ని చర్యలు చేపట్టినా సరే.. ఫలితం మాత్రం పెద్దగా ఉంటడం లేదు. ఇందుకు ప్రధాన కారణం.. బహిరంగ ప్రదేశాల్లో చాలా చోట్ల రోడ్డు పక్కనే కార్లు పార్కింగ్ చేస్తున్నారు. దీని వల్ల ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

Also Read : తీరం దాటిన కర్ణాటక రాజకీయ తుఫాన్

హైదరాబాద్‌లో చాలా పార్కుల దగ్గర సరైన పార్కింగ్ సౌకర్యం లేదు. దీని వల్ల ఆయా పార్కులకు వచ్చే వాళ్లు రోడ్డు పైనే కార్లు పార్కింగ్ చేస్తున్నారు. దీని వల్ల ట్రాఫిక్ సమస్య వస్తుందని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. దీనిపై జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఎన్నో సార్లు ఆయా పార్కుల వద్ద పార్కింగ్ సమస్య పరిష్కారానికి మార్గాలను అన్వేషించారు. కొన్ని చోట్ల నాలుగు కార్లు పార్కింగ్ చేసే అంత స్థలం కూడా లేదని గుర్తించారు. ఇలాంటి చోట అత్యాధునిక స్మార్ట్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.

హైదరాబాద్‌లో అత్యంత రద్దీ ఉన్న పార్కుల్లో కేబీఆర్ పార్క్ ఒకటి. ప్రతి రోజు సుమారు లక్ష మంది పైగా ఈ పార్కును సందర్శిస్తున్నారు. ఇందులో సెలబ్రెటీలు ఎక్కువగా వచ్చే పార్కు కూడా. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం కేబీఆర్ పార్కులో వాకింగ్ కోసం వచ్చే వాళ్లు.. తమ కార్లను కాంపౌండ్ చుట్టూ పార్కింగ్ చేస్తున్నారు. దీని వల్ల ప్రతి రోజు ఉదయం, సాయంత్రం భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, అపోలో సర్కిల్ మధ్యలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్యకు జీహెచ్ఎంసీ అధికారులు పరిష్కారం చూపించారు.

Also Read : హైదరాబాద్ లో బెజవాడ మైనర్లు సంచలనం..!

కేబీఆర్ పార్క్ వద్ద స్మార్ట్ మల్టీ లెవల్ వెహికల్ పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఈ అత్యాధునిక పార్కింగ్ సౌకర్యాన్ని గ్రేటర్ అధికారులు ప్రారంభించారు. నగరంలో బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసిన మొదటి ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ మల్టీ లెవల్ పార్కింగ్ ఇదే కావటం విశేషం. ఇప్పటి వరకు కేవలం బడా షాపింగ్ మాల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ పార్కింగ్ సౌకర్యం.. బహిరంగ ప్రదేశాల్లో తొలిసారి ఏర్పాటు చేశారు.

స్మార్ట్ మల్టీ లెవల్ పార్కింగ్ సిస్టమ్‌లో తక్కువ స్థలంలోనే 72 కార్లు పార్కింగ్ చేసే సౌకర్యం ఉంది. ఆటోమేటిక్‌గా తిరుగుతూ ఉండే విధానంలో ఈ స్మార్ట్ రోటరీ పార్కింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. కారును నేరుగా క్యాబిన్‌లో పార్క్ చేసిన తర్వాత అది పైకి రోటేట్ అవుతుంది. మళ్లీ కారు తీసుకునే సమయంలో క్యాబిన్ కిందకు వస్తుంది. ప్రస్తుతం 72 కార్లు పార్క్ చేసే మాదిరిగా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీని పని తీరు సమీక్షించిన తర్వాత.. త్వరలో మరిన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ పార్కింగ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. దీనికి అదనంగా టూవీలర్ పార్కింగ్, ఎలక్ట్రానిక్ వాహనాల ఛార్జింగ్ పాయింట్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

పోల్స్