Monday, October 20, 2025 01:56 AM
Monday, October 20, 2025 01:56 AM
roots

ఫ్రీ బస్.. ఇందుకు కూడానా..!

ఆంధ్రప్రదేశ్ మహిళలకు కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎన్నికల హామీలో ఇచ్చినట్లుగా మహిళలకు స్త్రీ శక్తి పధకం అమలు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేందుకు ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ పధకంపై ఇప్పటికే మహిళలకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది మహిళలు చేస్తున్న పనులకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read : ఆ విషయంలో వైసీపీ స్టాండ్ ఏమిటో..?

ఏపీలో మహిళలకు కూటమి ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తోంది. తొలుత కేవలం 5 బస్సుల్లోనే ఈ సౌకర్యం అమల్లోకి తీసుకువచ్చింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బస్సులో ప్రయాణించే సమయంలో ఆర్టీసీ స్త్రీ శక్తి జీరో టికెట్ జారీ చేస్తుంది. ఆ మేరకు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుంది.

Also Read : వాళ్ళను చంద్రబాబు వదలరు.. అసెంబ్లీలో కొత్త చట్టం

ఈ పధకాన్ని ఆగస్టు 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవ్ కలిసి ప్రారంభించారు. స్త్రీ శక్తి పధకం అమలుపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు వివిధ పనులపై తిరిగే మహిళలు, కూలీలు, ఉద్యోగులకు ఈ పధకం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. ప్రతి నెలా సుమారు 3 వేల రూపాయల వరకు ఆదా అవుతుందని కూడా సంతోషంగా చెబుతున్నారు.

Also Read : అమరావతిపై విషం.. గులాబీ కార్యకర్తలను వదలొద్దు అంటున్న ప్రజలు..!

అయితే ఈ పధకాన్ని కొందరు మహిళలు అకారణంగా వినియోగిస్తూ విమర్శల పాలవుతున్నారు. ఏ అవసరం లేకున్నా కూడా.. కేవలం ఫ్రీ బస్సు ఎలా ఉందో చూద్దామని ప్రయాణాలు చేస్తున్నారు. దీని వల్ల ప్రభుత్వంపై భారంతో పాటు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. తాడిపత్రికి చెందిన ఓ మహిళ అనంతపురం వరకు వెళ్లి వచ్చారు. తన తల్లి కోసం ఆకులు, వక్క, కట్లపొడి తీసుకొచ్చేందుకు ఫ్రీగా తాడిపత్రి నుంచి అనంతపురం వెళ్తున్నా అంటూ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆకులు, కట్లపొడి కోసం కూడా ఫ్రీ బస్సు ఎక్కుతారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ బస్సు పధకాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. మరి కొందరు అయితే.. ఈ మహిళ నుంచి డబుల్ ఛార్జీలు వసూలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ్రీ బస్సు రూల్స్ మార్చాలనేది మరికొందరి మాట. మరి కొందరైతే ఫ్రీ బస్సులో కొత్తగా ఏం లేదని.. అదే బస్సు, అదే డ్రైవర్, అదే కండక్టర్.. అయితే టికెట్ మాత్రమే లేదని.. కాబట్టి.. బస్సు చూడటం కోసం ప్రయాణాలు చేయవద్దని సూచిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్