Wednesday, February 4, 2026 11:29 PM
Wednesday, February 4, 2026 11:29 PM

లిమిట్స్ లో ఉండు.. సజ్జలకు మాజీ మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్

వైసీపీ అధికారం కోల్పోవడం ఏమోగానీ ఆ పార్టీలో నాయకులు ఇప్పుడు తీసుకుంటున్న ఓ నిర్ణయం రాజకీయ వర్గాల్లో సంచలనం అవుతోంది. అధికారం ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో అత్యంత కీలకంగా ఉన్నారు. పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడాలి లేదా ఏదైనా పర్యటన చేయాలన్నా సరే ఆయన అనుమతి తప్పనిసరిగా మారేది. సోషల్ మీడియా ఖాతాలు సైతం ఆయన కొడుకు చేతిలోనే ఉండే పరిస్థితి. ఒకరకంగా వైసిపి ఓటమికి సజ్జల రామకృష్ణారెడ్డి అత్యంత కీలక కారణం. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయింది.

Also Read : ఎమ్మెల్యేలు ఆ పనులు చేయాలి.. చంద్రబాబు కీలక ప్రసంగం

కాబట్టి ఆయనకు భయపడాల్సిన అవసరం ఆ పార్టీ నాయకులకు గానీ కార్యకర్తలకు గానీ లేదు. దీంతో సజ్జలను లైట్ తీసుకుంటున్నారు పార్టీ నాయకులు. తాజాగా పార్టీ కీలక సమావేశం నిర్వహించారు అధినేత జగన్. ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసిపి నాయకులు అందరూ హాజరయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా హాజరై పార్టీ నాయకులకు దిశనిర్దేశం చేసే ప్రయత్నం చేశారు. అయితే రాయలసీమకు చెందిన ఓ మాజీ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ముఖం పైనే.. నీ బౌండరీ లో నువ్వు ఉండు అంటూ వార్నింగ్ ఇచ్చారట.

Also Read : బీఎస్ఎన్ఎల్ సరికొత్త అడుగు.. భారత్ నూతన అధ్యాయం..!

ఇప్పటికే వ్యక్తిగతంగా ఇబ్బందులు పడుతున్న సదరు మాజీ మంత్రి సజ్జల అతి జోక్యంపై పార్టీ నేతలు ముందే కడిగేశారట. నీవల్ల పార్టీకి అలాగే అధినేత జగన్మోహన్ రెడ్డికి నష్టం జరుగుతోందని.. నీ ఆదేశాలు సూచనలు పాటించాల్సిన అవసరం పార్టీ నాయకులకు లేదని ఒక రకంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. సొంత జిల్లా నేతలకు సజ్జల చేస్తున్న సలహాలు, దిశ నిర్దేశాన్ని సదరు మాజీ మంత్రి రిసీవ్ చేసుకోలేకపోయారు. దీనితో ఏమాత్రం మొహమాటం లేకుండా సజ్జల ఆదేశాలు పాటించాల్సిన అవసరం లేదని ఆయన ముందే పార్టీ నాయకులకు కూడా చెప్పారట. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అంటూ సదరు మాజీ మంత్రి మాట్లాడటంతో సజ్జల కంగు తిన్నారు. అలాగే కృష్ణా జిల్లాకు చెందిన ఓ నాయకుడు కూడా ఇదేవిధంగా సజ్జలకు సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఇక సజ్జల మీడియా సమావేశాలు పెట్టమని పార్టీ నాయకులకు ఫోన్లు చేసిన సరే.. ఆన్సర్ చేయొద్దని మాజీ మంత్రి తన జిల్లా నేతలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మీడియా కవరేజ్ కోసం కూడా సజ్జల మీద ఆధారపడొద్దని సదరు నేత స్పష్టంగా చెప్పారట.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్