Wednesday, February 4, 2026 02:13 PM
Wednesday, February 4, 2026 02:13 PM

ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ ప్రవీణ్ ప్రకాష్.. షాక్ లో అధికార వర్గాలు

సాధారణంగా రాజకీయ నాయకులకు, అధికారులకు మధ్య మంచి సంబంధాలే ఉంటాయి. తమ మాట వినని.. అధికారులను ఎలా దారిలో పెట్టుకోవాలో రాజకీయ నాయకులకు బాగా తెలుసు. రాజకీయ నాయకులు తమ దారిలోకి ఎలా రావాలో అధికారులకు ఒక క్లారిటీ ఉంటుంది. వాస్తవం మాట్లాడుకుంటే నిజాయితీ, నైతిక విలువలు, జాలి, దయ వంటి పదాలకు ఈ బంధాల్లో పెద్దగా విలువ ఉండదు. ఇచ్చిపుచ్చుకోవడాలు సహజంగా జరిగేవి. ముఖ్యంగా కీలక పదవుల్లో ఉండే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు.. ఇది బాగా వర్తిస్తుంది.

Also Read : వైసీపీలో కలకలం.. అప్రూవర్‌గా ధర్మారెడ్డి..!

కొందరు అధికారుల తీరు కారణంగా.. అధికారులు అందరిపై అవినీతి మరకనేది పడింది. రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కారణంగా కొందరు అధికారుల ప్రవర్తన ఎన్నో సందర్భాల్లో విమర్శలకు దారి తీసింది. కాబట్టి ఈ బంధం లో ఒకరిది తప్పు మరొకరిది ఒప్పు అనడానికి దాదాపుగా ఆస్కారం ఉండదు. కానీ తాజాగా ప్రవీణ్ ప్రకాష్ అనే మాజీ ఐఏఎస్ అధికారి విడుదల చేసిన వీడియో చూస్తే, చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది అంటున్నాయి అధికార వర్గాలు. వ్యవస్థలో దారితప్పిన అధికారులకు.. అవినీతి మరకంటిన రాజకీయ నాయకులకు దగ్గర సంబంధాలు ఉంటాయి.

ఈ విషయంలో ప్రవీణ్ ప్రకాష్ ముందుంటారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుంచి.. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిన చివరి రోజు వరకు.. ప్రవీణ్ ప్రకాష్ ఆడిందే ఆట పాడిందే పాట. తనకు సంబంధం ఉన్న శాఖలతో పాటుగా.. తనకు సంబంధం లేని శాఖలలో కూడా ఆదేశాలు ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ప్రవీణ్ ప్రకాష్.. మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, మాజీ ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ లకు క్షమాపణలు చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో ప్రకారం చూస్తే.. ఇద్దరు విషయంలో తాను తప్పు చేశానని, వాళ్ల కుటుంబాలతో పాటుగా వాళ్ళిద్దరికీ క్షమాపణలు చెబుతున్నానని వీడియోలో పేర్కొన్నారు.

Also Read : వైవీ సుబ్బారెడ్డి అరెస్ట్..? ఆయన్ను కూడా..?

ఈ సందర్భంగా ఎథిక్స్, మొరాలిటీ తనకు ఎంతగానో ఉన్నాయని ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ఆ కామెంట్స్ చాలామందిని ఆశ్చర్యపరిచాయి. తాను రూపాయి కూడా అవినీతి చేయలేదని, 30 ఏళ్ల పాటు అధికారిక విధులు నిర్వహించానని, విజయవాడ, గుంటూరులో తనకు హీరో ఇమేజ్ వచ్చిందని గుర్తు చేసుకున్నారు. ఇదే చాలామందిని ఆశ్చర్యపరిచిన కామెంట్. తాను రూపాయి కూడా అవినీతి చేయనప్పుడు, కృష్ణ కిషోర్, ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో ఎవరి ఒత్తిడి మేరకు ఆయన వేధించారు అనేది ప్రధాన ప్రశ్న. అసలు వేధింపులకు ఆయన గురికావడం వెనుక కారణం ఏంటి అనేది మరో ప్రశ్న. తనకు లబ్ధి లేకుండా.. రాజకీయ నాయకులు టార్గెట్ చేసిన అధికారులను ఈయన గారు ఎలా వేధిస్తారు అనేది మరో ప్రశ్న.

డీజీపీ ఆఫీసు నుంచి ఏబి వెంకటేశ్వరరావు ఫైల్ వచ్చినప్పుడు.. అది చట్టానికి అతీతంగా ఉన్నప్పుడు.. ప్రవీణ్ ప్రకాష్ ఆరోజు ఎందుకు మీడియా ముందుకు రాలేదు అనేది మరో ప్రశ్న. ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్న ప్రవీణ్ ప్రకాష్.. తనతో ఏ విధమైనటువంటి శత్రుత్వం లేని ఇద్దరు అధికారులను వేధించటానికి తాను పొందిన లబ్ధి ఏంటి అనేది ఇంకొక ప్రశ్న. 49 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు.. 2020లో తన వద్దకు వాళ్ళిద్దరి ఫైల్స్ వచ్చినప్పుడు.. తాను తప్పు చేయలేనని, చట్ట ప్రకారమే వెళతానని ఆరోజు ఎందుకు చెప్పలేదు అనేది మరో ప్రశ్న. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పుడు.. 2024లో ప్రభుత్వం దిగిపోయే వరకు తాను ఎందుకు కీలక బాధ్యతలు నిర్వహించారు అనేది కూడా మరో ప్రశ్న.

Also Read : జగన్‌ అసెంబ్లీకి ఎందుకు రావటం లేదో తెలుసా..?

తనకు తప్పు చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పుడు ప్రవీణ్ ప్రకాష్ కచ్చితంగా మాట్లాడి ఉంటే మరొక రకంగా ఉండేది. ఇప్పుడు కేవలం వ్యక్తిగతంగా తాను ఎదుర్కొంటున్న సమస్యలతో.. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రవీణ్ ప్రకాష్ వీడియో రిలీజ్ చేయడం ఆశ్చర్యంగా ఉంది అంటున్నాయి అధికారిక వర్గాలు. ఏబీ వెంకటేశ్వరరావును, జాస్తి కృష్ణ కిషోర్ ను.. అప్పటి ప్రభుత్వం అన్ని ఇబ్బందులు పెడుతున్నా సరే.. ఇది తప్పని ఆయన మీడియా ముందుకు వచ్చి ఎందుకు ఖండించలేదు అనేది కూడా ఇక్కడ ప్రస్తుతం వినపడుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్