భారత క్రికెట్ లో కొత్త సాంప్రదాయానికి యువ ఆటగాళ్ళు తెరలేపుతున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. తమను అన్ని విధాలుగా ప్రోత్సహించిన సీనియర్ ఆటగాళ్ళపై తప్పుడు ప్రచారం చేయించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవల ఓ యువ ఆటగాడి తండ్రి తన కొడుకుకి వన్డే కెప్టెన్సీ పదవి ఇప్పించేందుకు, సోషల్ మీడియా వేదికగా శ్రేయాస్ అయ్యర్, యశస్వీ జైస్వాల్ కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయించినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు.. రోహిత్ శర్మపై కూడా అలాంటి ప్రచారమే జరుగుతోంది.
Also Read : బీజేపీ ఛీఫ్ ఎవరు..? వెంకయ్య సలహాకే ప్రాధాన్యత..?
బ్రోంకో టెస్ట్ లో రోహిత్ శర్మ ఫెయిల్ అయ్యాడని. అతనిని కెప్టెన్సీ పదవి నుంచి తప్పిస్తారు అని ప్రచారం గట్టిగా జరుగుతోంది. అలాగే విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటన తర్వాత రిటైర్ అవుతాడు అంటూ హడావుడి చేయడం మొదలుపెట్టారు. 2027 ప్రపంచ కప్ వరకు ఈ ఇద్దరూ క్రికెట్ ఆడతారని బోర్డు పెద్దలు క్లారిటీ ఇచ్చేసారు. ప్రస్తుత బోర్డు అధ్యక్షుడు రాజీవ్ శుక్లా చాలా క్లియర్ గా చెప్పారు. అయినా సరే రోహిత్ ను టార్గెట్ చేయడం విడ్డూరంగా ఉంది అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
Also Read : హీరో ఛాన్స్ మిస్ చేసుకున్న జగన్
సదరు యువ ఆటగాడిని రోహిత్, కోహ్లీ ఎన్నో సందర్భాల్లో ప్రోత్సహించారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఫైయిల్ అయినా సరే రోహిత్ అండగా నిలిచాడు. అటు శ్రేయాస్ అయ్యర్ పై కూడా ఇదే రేంజ్ లో ప్రచారం చేస్తూ వస్తున్నాయి కొన్ని సోషల్ మీడియా పేజ్ లు. గంభీర్ తో విభేదాలు ఉన్నాయని, అందుకే అతను జట్టులోకి రావడం లేదని, జైస్వాల్ వన్డే క్రికెట్ కు సూట్ అవ్వడు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఆసియా కప్ టీం సెలెక్షన్ లో అయ్యర్ లేకపోవడం వెనుక ఆ యువ ఆటగాడి పాత్రే ఉందంటున్నాయి క్రికెట్ వర్గాలు.

