Sunday, March 22, 2026 09:48 AM
Sunday, March 22, 2026 09:48 AM

మాజీ మంత్రి రోజా అరెస్ట్ కి రంగం సిద్ధం?

ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వంలో నేతల అవినీతి వ్యవహారాలను లక్ష్యంగా చేసుకుని ప్రస్తుత టిడిపి ప్రభుత్వం విచారణ ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ముందు మాజీ మంత్రుల లక్ష్యంగా అవినీతి వ్యవహారాలను బయటకు లాగే ప్రయత్నం చేస్తుంది సర్కార్. ఇప్పటికే నలుగురు మాజీ మంత్రుల మీద దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం… ఇప్పుడు మరో మాజీ మంత్రి అవినీతి వ్యవహారాలను లక్ష్యంగా చేసుకుని అడుగులు వేస్తోంది. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో గత ప్రభుత్వం హడావుడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కార్యక్రమంలో జరిగిన అవినీతి, అక్రమాల మీద దృష్టి సారించింది బాబు సర్కార్.

గత ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో 150 కొట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని ఏపీ ప్రభుత్వం గుర్తించి విచారణకు ఆదేశించింది. సిఐడి చేత విచారణ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని విజయవాడ పోలీస్ కమీషనర్ కి సిఐడి చీఫ్ లేఖ రాసారు. మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణ దాస్ లపై సిఐడి విచారణకు ఆదేశాలు జారీ చేసారు. నాలుగు రోజుల క్రితం శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి… ఈ అక్రమాలను గుర్తించినట్టు తెలుస్తోంది. సమీక్ష రోజే అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. నాసిరకం క్రీడా కిట్లు కొనుగోలు చేసినట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.

పోటీలు నిర్వహిస్తున్న సమయంలోనే క్రికెట్ బ్యాట్లు విరిగిపోవడం ద్వారా వాటి నాణ్యతలో డొల్లతనం అప్పట్లోనే బయటపడి తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. జర్సీల కొనుగోళ్ల నుంచి క్రీడాకారులకు కల్పించిన భోజనంలోనూ నిధులు స్వాహా చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేసారు. టెండర్ల ప్రక్రియ, వర్క్ ఆర్డర్ ఇచ్చిన క్రీడా పరికరాలు ఎన్ని, రాష్ట్రానికి వచ్చినవి ఎన్ని, క్రీడాకారులకు ఇచ్చినవి ఎన్ని, వాటిలో నాణ్యత తదితర అంశాలపై సమగ్ర విచారణ చేయించడం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇవ్వాళ, రేపు మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణ దాస్ లకి విచారణకు రావాలని నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్