Friday, September 12, 2025 06:42 PM
Friday, September 12, 2025 06:42 PM
roots

ఇదేం బంతిరా బాబూ.. 18 ఓవర్లకే కంప్లైంట్..!

టెస్ట్ క్రికెట్ లో బంతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వైట్ బాల్ క్రికెట్ లో బంతి గురించి పెద్దగా చర్చ జరగకపోయినా.. సుదీర్ఘ ఫార్మాట్ లో బంతి మన్నిక గురించి ఎన్నో చర్చలు చూస్తూ ఉంటాం. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతోన్న టెస్ట్ సీరీస్ లో డ్యూక్స్ బాల్ మన్నికపై అనుమానాలు కలుగుతున్నాయి. ఇరు జట్ల ఆటగాళ్ళు పదే పదే బంతిని మార్చాలని కోరడం మనం చూస్తూనే ఉన్నాం. గాగ్ టెస్ట్ లో బంతి ఫెయిల్ కావడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం.

Also Read : వైసీపీ కి దోచిపెట్టిన అధికారుల పై చర్యలేవి..?

80 ఓవర్ల పాటు ఒకే బంతిని వాడాల్సి ఉంటుంది. కాని 30 ఓవర్ల పాటు ఆ బంతిని కొనసాగించడం కష్టంగా మారింది అనేది ఆటగాళ్ళ ఆవేదన. 81 ఓవర్ నుంచి కొత్త బంతి ఇస్తారు. కాని నిన్న రెండో బంతి తీసుకున్న 18 వ ఓవర్లోనే బంతి షేప్ మారిపోయింది. గాగ్ టెస్ట్ లో కూడా ఫెయిల్ కావడంతో వెంటనే మరో బాల్ ఇచ్చారు. అయితే తయారి కంపెనీ మాత్రం.. ఆటగాళ్లకు వికెట్లు పడని ప్రతీసారి బంతి గురించి కంప్లైంట్ చేస్తున్నారని ఆరోపిస్తోంది. కాని బాల్ మాత్రం గాగ్ టెస్ట్ లో ఫెయిల్ అవుతోంది.

Also Read : అన్ని ఉత్త ప్రగల్భాలేనా..?

డ్యూక్స్ యజమాని దిలీప్ జజోడియా దీనిపై స్పందిస్తూ ఆటగాళ్ళు ఓపికగా ఉండాలన్నాడు. 18వ శతాబ్దం నాటి చరిత్ర కలిగిన ఈ కంపెనీ.. అన్ని రకాల వాతావరణం, బలమైన బ్యాట్ లతో బాదినా సరే తట్టుకునే విధంగా రూపొందించామని.. ఈ విషయంలో అనవసర విమర్శలు వద్దని కొట్టిపాడేసాడు. లార్డ్స్ టెస్ట్‌ లో మూడవ రోజు ఉదయం సెషన్‌లో డ్యూక్స్‌ బంతిని రెండుసార్లు మార్చారు. 10 ఓవర్ల తర్వాత బంతిని మార్చాల్సి రావడంపై అసహనం కెప్టెన్ గిల్ అసహనం వ్యక్తం చేసాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్