Tuesday, October 28, 2025 01:50 AM
Tuesday, October 28, 2025 01:50 AM
roots

దేశాన్ని వణికిస్తున్న భూకంపాలు.. షేక్ అవుతున్న ఢిల్లీ, తెలుగు రాష్ట్రాలు

గత కొన్నాళ్ళుగా భారత్ లో భూకంపాలు కంగారు పెడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కాక మన తెలుగు రాష్ట్రాలు సైతం ఆందోళనలో ఉన్నాయి. తెలంగాణాలోని ములుగు ఏజెన్సీ… ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా భూకంపాలకు వణికే పరిస్థితి నెలకొంది. ఇక మయన్మార్ ప్రాంతంలో వస్తున్న భూకంపాలు మన దేశాన్ని భయపెడుతున్నాయి. ఉత్తర భారతంలో భూకంపాల తీవ్రత కనపడుతోంది. తాజాగా మరోసారి భూకంపాల తీవ్రతకు దేశంలో ఆందోళన మొదలైంది.

Also Read : సజ్జల అరెస్ట్ ఖాయం.. లోకేష్ ట్వీట్ ఇచ్చిన సిగ్నల్..?

గత 36 గంటల్లో భారత్-మయన్మార్ సరిహద్దులలో తేలికపాటి నుండి ఓ మాదిరి తీవ్రతతో ఆరు భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8 నుండి 4.5 మధ్య నమోదైంది. చివరి భూకంపం ఉదయం 11.21 గంటలకు మణిపూర్ సమీపంలో 4.3 తీవ్రతతో నమోదైంది. మంగళవారం తెల్లవారుజామున టిబెట్‌లో 4.2 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సిఎస్) ధృవీకరించింది. ఆగ్నేయ ఢిల్లీలో మొన్న రాత్రి 1:23 గంటలకు 2.3 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది.

Also Read : వైసీపీలో నువ్వుంటే చాలంటున్న టీడీపీ నేతలు..!

అయితే ఎటువంటి నష్టం జరిగినట్లు జాతీయ మీడియా వెల్లడించలేదు. ఈ భూకంపం భూ ఉపరితలం నుంచి 5 కి.మీ లోతులో సంభవించింది. 2025లో ఢిల్లీ కేంద్రంగా ఇటువంటి సంఘటన జరగడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 17న ఉదయం 5:36 గంటలకు రాజధానిని 4.0 తీవ్రతతో భూకంపం కుదిపేసింది. ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా మరియు ఘజియాబాద్‌లలో బలమైన ప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం ధౌలా కువాన్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ కళాశాల సమీపంలో గుర్తించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్