Tuesday, October 28, 2025 01:36 AM
Tuesday, October 28, 2025 01:36 AM
roots

బాబు భద్రత పై అంతుచిక్కని ప్రశ్నలేన్నో

సాధారణంగా జెడ్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తి భద్రత విషయంలో ప్రతీ విషయం క్షుణ్ణంగా పరిశీలించి జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కడ ఏ లోపం ఉన్నా సరే అది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రత విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల చంద్రబాబు కోసం కేటాయించిన ఒక హెలికాప్టర్ పూణే సమీపంలోని ఒక గ్రామంలో కూలిపోయింది. చాలా తక్కువ ఎత్తులోనే అది కూలిపోవడం సంచలనం అయింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు గాని… అది చంద్రబాబు ఎక్కినప్పుడు జరిగి ఉంటే పరిస్థితి ఏంటీ అనే ప్రశ్నలు వినపడుతున్నాయి.

ఆ హెలికాప్టర్ సర్వీసు 16 ఏళ్ళు. సాధారణంగా ముఖ్యమంత్రులకు వాడే హెలికాప్టర్ సర్వీసులో 10 ఏళ్ళ కంటే ఎక్కువగా ఉంటే వినియోగించే అవకాశం లేదు. అది నిబంధనలకు విరుద్దం. చంద్రబాబు కోసం కేటాయించిన హెలికాప్టర్ ను సర్వీసు కు పంపించడంతో ఆ స్థానంలో మరో హెలికాప్టర్ ను తాత్కాలికంగా పంపించారు. అదే ప్రమాదానికి గురైంది. దీని వెనుక తప్పు ఎవరిది అనే ప్రశ్న వినపడుతోంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసే కల్నల్‌ ప్రొటోకాల్‌, ఏవియేషన్‌ ఎండీగా బాధ్యతలు నిర్వహించేవారు.

కాని ఇప్పుడు ఐఅండ్‌ఐ సంస్థలో పనిచేసే ఓ జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారి ఏవియేషన్‌ బాధ్యతలు చేపడుతున్నారు. ఏవియేషన్‌పై పెద్దగా అవగాహన లేని వ్యక్తికి ఆ బాధ్యతలు ఇచ్చారు. దాని కారణంగానే గ్లోబల్‌ వెకా్ట్ర అనే సంస్థ నుంచి వీటీ-జీవీఐ, ఏడబ్ల్యూ 139 2008 మోడల్‌ హెలికాప్టర్‌ను విజయవాడ తీసుకొచ్చేందుకు అనుమతి తీసుకున్నారనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. దీని వెనుక ఎవరిది అయినా ప్రమేయం ఉందా అనే ప్రశ్నలు సైతం వినపడుతున్నాయి. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత హెలికాప్టర్ ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు అధికారులు. కాని 16 ఏళ్ళ నాటి ముసలి హెలికాప్టర్ ను ఎందుకు తెచ్చారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్