Friday, September 12, 2025 11:21 PM
Friday, September 12, 2025 11:21 PM
roots

కుక్కల ఫుడ్ తినేశారు.. పెట్రోల్ తాగేశారు.. వైసీపీ హయాంలో కొత్త రకం అవినీతి

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ హయాంలో జరిగిన కొన్ని అవినీతి వ్యవహారాలు ఎప్పటికైనా సంచలనమే. రాజకీయంగా బలంగా ఉన్నామనే కారణమో లేక తమను ఎవరు ఎం చేయలేరు అనే ధీమానో తెలియదు గాని పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలకు గత ప్రభుత్వంలో అధికారుల నుంచి నాయకుల వరకు ప్రతీ ఒక్కరు పాల్పడ్డారు అనేది వాస్తవం. కొన్ని కొన్ని అవినీతి వ్యవహారాల విషయంలో… ప్రజలు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉన్నాయి చర్యలు. సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం, అమరావతిలో రోడ్లు తవ్వుకోవడం వంటివి ఆశ్చర్యం కలిగించాయి.

Also Read : చంద్రబాబుకు, జగన్‌కు అదే తేడా..!

ఇక తాజాగా పోలీసు జాగిలాలకు పెట్టె ఆహారంలో కూడా అవినీతి జరిగిందనే వార్త ఒకటి సంచలనం రేపుతోంది. పోలీసు జాగిలాలకు పెట్టే ఆహారం లో నిధుల స్వాహా పై హోం శాఖ చర్యలు తీసుకొనేందుకు సిద్దమైంది. నాసిరకమైన ఆహారాన్ని కొని వాటి ఆరోగ్యం దెబ్బతినడానికి కారకులయ్యారంటూ ప్రస్తుతం ఎచ్చెర్ల ఏపీఎస్పీ బెటాలియన్ డీఎస్పీగా పనిచేస్తున్న టి. శ్రీనివాసరావు పై అభియోగాలు నమోదు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2012 ఫిబ్రవరి నుంచి 2023 మే 3 వరకూ ఐఎస్డబ్ల్యూ, స్పెషల్ సెక్యూరిటీ గ్రూపుల్లోని డాగ్ స్క్వాడ్ విభాగాలకు ఇన్ఛార్జ్ గా విధులు నిర్వర్తించారు శ్రీనివాస్ రావు.

Also Read : వాట్సాప్ సేవలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కుక్క పిల్లల కొనుగోలు, ఎంపికలోనూ నిబంధనలను ఉల్లంఘించినట్టు అభియోగాలు ఉన్నాయి. పర్యవేక్షణా లోపం పై అప్పటి ఐఎస్ డబ్ల్యూ విభాగం ఎస్పీగా పనిచేసి రిటైర్డ్ అయిన కె. సూర్యభాస్కర్ రెడ్డిపైనా అభియోగాలు మోపారు. 2022 మే నుంచి 2023 ఏప్రిల్ మధ్య ఐఎస్డబ్ల్యూకి చెందిన 8 వాహనాలు తిరగకపోయినా 4,093 లీటర్ల పెట్రోల్ వినియోగించినట్లు రికార్డుల్లో చూపించి నిధులు డ్రా చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ప్రస్తుతం పీటీవో డీఎస్పీగా ఉన్న డి. కోటేశ్వరరావు, కృష్ణా జిల్లాలో ఆర్ఎస్సైగా పనిచేస్తున్న ఎం.సతీష్ కుమార్, కాకినాడ బెటాలియన్లో ఆర్ఎస్సైగా ఎం. కృష్ణ పైనా అభియోగాలు మోపారు. ఈ మేరకు హోం శాఖ ఇంచార్జ్ కార్యదర్శి జి. విజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్