Thursday, February 5, 2026 06:39 AM
Thursday, February 5, 2026 06:39 AM

కొత్త మద్యం పాలసీపై మాట్లాడే ధైర్యం లేదా జగన్?

మద్యపాన నిషేధం అనేది భారతదేశంలో ఒక బూతు పదం లాగా మారిపోయింది. ఏంటి అంత మాట అన్నారు అంటారా…? గాంధీజీ పుట్టిన గుజరాత్ లోనే జనాలు మద్యానికి దూరంగా ఉండలేని దేశం ఇది. అలాంటి దేశంలో ఓట్ల కోసం ఏ కథలు పడితే ఆ కథలు చెప్తే వినడానికి జనాలు సిద్దంగా ఉండరు. కానీ జగన్ అదృష్టమో మరో కారణమో తెలియదు గాని 2019 లో విన్నారు, నమ్మారు, ఓట్లు వేసారు. సరే అది అమలు చేయడం సాధ్యమేనా…? దాని కోసం ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, ఇండో పాక్ సరిహద్దులు తరహా నిఘా పెట్టి… వాహనాలు లాక్కుని అరెస్ట్ లు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన విషయం మనం చూసాం.

గుజరాత్ లో మద్యపాన నిషేధం అమలులో ఉంది. అక్కడి యువత మద్యం దొరకక గంజాయికి బానిస అయ్యారు. సరిహద్దు రాష్ట్రాలు అయిన మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానాల నుంచి పెద్ద ఎత్తున మద్యం అక్రమంగా గుజరాత్ కు వెళ్తూనే ఉంది. అది ఆపడం అక్కడి పోలీసులకు కూడా ఏ విధంగా సాధ్యం కావడం లేదు. ఎన్నో కష్టాలు పడినా ఏపీలో మద్యాన్ని కట్టడి చేయడం అనేది సాధ్యం కాలేదు. సారీ… మద్యపాన నిషేధం కాదది… ఏపీలో ఉన్న మందు తాగాలి అని… ఏపీలో ఒక్క ప్రకాశం జిల్లాకు తప్పించి అన్ని జిల్లాలకు వేరే రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్నాయి.

కాబట్టి పోలీసులు అందరూ వెళ్లి సరిహద్దుల్లో కూర్చున్నా ఆపడం సాధ్యం కాదు. చివరకు హైకోర్ట్ ప్రభుత్వ జీవోని అమలు చేయాలని ఇచ్చిన మూడు బాటిల్స్ ఆదేశాలు కూడా అమలు చేయలేదు. ఆ జీవోని కూడా కొట్టేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏం చేయాలో తెలియక సరిహద్దుల్లో నిఘా తీసేశారు. ఇప్పుడు ఏపీలో నూతన మద్యం పాలసీ వస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త మద్యం దుకాణాలు ఈ నెల 12 నుంచి రాష్ట్రంలో ఓపెన్ అవుతాయి. ప్రీమియం స్టోర్స్ కూడా ఓపెన్ చేయనుంది సర్కార్.

Read Also : స్వామీజీలతో జగన్ నయా ప్లాన్

దీనిపై వైసీపీ నుంచి ఒక్కటి అంటే ఒక్క విమర్శ కూడా లేదు. మద్యంతో చంద్రబాబు ప్రజల రక్తం తాగుతున్నాడని అప్పట్లో మైకుల ముందు నానా రకాల మాటలు మాట్లాడిన వైసీపీ నేతలు అసలు ఇప్పుడు ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాజకీయంగా ఒకప్పుడు మద్యాన్ని అడ్డం పెట్టుకున్న జగన్… తమ మద్యం పాలసీ గురించి గాని… చివరకు మద్యం షాపుల్లో ప్రభుత్వ ఉద్యోగాల స్థాయిలో వైసీపీ కార్యకర్తలను నియమించుకున్నా వాళ్ళ గురించి గాని ఎక్కడా ఏ వైసీపీ నాయకుడు మాట్లాడలేదు. మరి మద్యం షాపులు ఏర్పాటు అయ్యాక అయినా మాట్లాడతారో లేదో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్