Wednesday, February 4, 2026 08:52 PM
Wednesday, February 4, 2026 08:52 PM

అమిత్ షాపై సంచలన వ్యాఖ్యలు.. వివాదంగా మారిన పదం..!

తమిళనాడు ఎన్నికలను బిజెపి సీరియస్ గా తీసుకున్న నేపధ్యంలో అక్కడి రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార డిఎంకె.. బిజెపిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తోంది. దక్షిణాది భావజాలాన్ని డిఎంకె ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుండటం ఆసక్తిని రేపుతోంది. తాజాగా డిఎంకె కీలక నేత రాజా.. కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేసారు. అమిత్ షా మూర్ఖుడు అంటూ ఆయన ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో విజయం సాధించిన తర్వాత బీజేపీ తమిళనాడులోకి ప్రవేశిస్తుందని షా ఇటీవల ఓ కామెంట్ చేసారు.

Also Read : వివేకా కేసులో మరో నిందితుడ్ని లేపెయడానికి ప్లాన్..?

బహిరంగ సభలో ప్రసంగిస్తూ రాజా.. అమిత్ షా మధురైకి వచ్చి.. మనం ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్రలను స్వాధీనం చేసుకున్నామన్నారు.. తరువాత తమిళనాడు అని ఆయన అన్నారని.. అమిత్ షా ఒక మూర్ఖుడు అంటూ మండిపడ్డారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఒక రాజకీయ పార్టీకి ఏకైక నాయకుడు.. హర్యానా, మహారాష్ట్రలలో ఆయన ఒంటరి వ్యక్తిని ఓడించారు. ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ ఒంటరి వ్యక్తి కాదు.. ఎందుకంటే అతని వెనుక పెరియార్, అన్నా, కరుణానిధి, ద్రవిడ తత్వశాస్త్రం ఉన్నాయన్నారు.

Also Read : టీడీపీ, వైసీపీ మధ్య సెక్యూరిటీ వార్..!

ద్రవిడ సైద్ధాంతిక సంప్రదాయం ముందు బిజెపి “అయోమయంగా” కనపడుతోందని విమర్శించారు. రాజా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బిజెపి అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి.. తీవ్రంగా స్పందించారు. మాజీ మంత్రి, మూర్ఖుడు.. ఎ రాజా అమిత్ షాను ‘మూర్ఖుడు’ అని పిలిచి అమర్యాదకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేసారు. భారత హోంమంత్రిని అలా విమర్శించే ఎవరైనా మూర్ఖులే కావచ్చన్నారు. తమిళనాడులో బిజెపి విజయం సాధించడం ఖాయమని స్పష్టం చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్