Sunday, March 22, 2026 08:46 AM
Sunday, March 22, 2026 08:46 AM

జరిగిందిదే.. ఐటీ రైడ్స్ పై దిల్ రాజు వ్యాఖ్యలు..!

ప్రముఖ నిర్మాతలు, డైరెక్టర్లపై గత నాలుగు రోజుల పాటు పెద్ద ఎత్తున ఐటి సోదాలు జరిగాయి. ఈ సోదాలు ఏం స్వాధీనం చేసుకున్నారు అనే దాని కంటే మీడియా హడావుడి ఎక్కువగా జరిగింది. ఈ తరుణంలో ప్రముఖ నిర్మాత దిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నాలుగు రోజులు నుండి ఐటీ రైడ్స్ జరిగాయని.. ఇవి సాధారణంగా జరిగే సోదాలే అన్నారు. నేను సెలబ్రిటీ కాబట్టి మీడియా అంతా నా మీద ఫోకస్ చేసిందని పేర్కొన్నారు. నాలుగు రోజులు నుండి ఏం జరిగింది అనేది చెప్పాలన్నారు. 2008 లో ఒకసారి సెర్చ్ జరిగిందని తెలిపారు.

Also Read : రాజకీయాలకు గుడ్‌ బై.. ఇక వ్యవసాయమే..!

మళ్ళీ ఇప్పుడు జరిగిందని.. మా కుటుంబం, ఆఫీస్ లో సెర్చ్ జరిగిందని స్టేట్మెంట్ తీసుకున్నారన్నారు. మా దగ్గర డబ్బు కానీ, డాకుమెంట్స్ తీసుకున్నారని న్యూస్ వేసారు అని అసహనం వ్యక్తం చేసారు. నా దగ్గర 5లక్షలు, శిరీష్ దగ్గర 4.50 లక్షలు, తీసుకున్నారని.. ఐటీ డిపార్ట్మెంట్ ఆశ్చర్యపోయిందన్నారు. దిల్ రాజు దగ్గర మేము ఏదో ఎక్సపెక్ట్ చేసాం అన్నారని మా అమ్మ కు సడెన్ గా దగ్గు వస్తే హాస్పిటల్ తీసుకెళ్తే, హార్ట్ అటక్ అని రాసారని అసహనం వ్యక్తం చేసారు. నన్ను ఎవరు టార్గెట్ చేయలేదని స్పష్టం చేసారు.

Also Read : మంత్రి కొండపల్లి బ్లడ్ డొనేషన్ రికార్డ్.. దుమ్మురేపిన క్యాడర్…!

అందరి మీద జరిగాయన్నారు. తెలిసిన, తెలియని వార్తలు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే మీడియా ముందుకు వచ్చాను అన్నారు. నా కూతురు హన్సిత రెడ్డి దగ్గర ఆరున్నర లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. గత అయిదేళ్లుగా తాను ఎక్కడా ఆస్తులు కొనలేదు అన్నారు. ఒక్కొక్క సినిమా లావాదేవీలు గురించి అడిగి తెలుసుకున్నారని తెలిపారు. తన తల్లి ఆరోగ్యం బాగుందని వచ్చే నెల 3 న విచారణకు పిలిచారని పేర్కొన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్