Friday, September 12, 2025 07:19 PM
Friday, September 12, 2025 07:19 PM
roots

దిల్ రాజు టార్గెట్ పుష్ప.. రామ్ చరణ్ వర్కౌట్ అదే

మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ నుంచి ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో బరిలోకి దిగినున్నాడు. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాపై మెగా అభిమానులతో పాటుగా సినీ ప్రేక్షకులు కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సోలో సినిమా ఇదే. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. అటు వరల్డ్ వైడ్ గా కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేశారు.

ఇక తాజాగా అమెరికాలో జరిగిన ఈవెంట్ కూడా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొన్నాయి. ప్రీ బుకింగ్ మార్కెట్ కూడా అమెరికాలో భారీగా జరుగుతుంది. ఈ సినిమాను దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాడు. అయితే ఇప్పుడు మెగా అభిమానులు అలాగే మెగా ఫ్యామిలీ మొత్తం టార్గెట్ మొత్తం అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప పార్ట్ 2 సినిమా రికార్డులను బద్దలు కొట్టడం. అమెరికాలో ప్రీ బుకింగ్ మార్కెట్ విషయంలో పుష్ప సినిమాను టార్గెట్ చేశాడు రామ్ చరణ్.

Also Read : కేటిఆర్ పక్కాగా బుక్ అయ్యాడు.. ఏసీబీ సంచలన అడుగులు

అందుకే అక్కడ మెగా అభిమానులు కూడా ఈ సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. ఇక నార్త్ ఇండియా లో కూడా సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలని… ఇందుకోసం భారీ ఈవెంట్స్ ను ప్లాన్ చేయాలని దిల్ రాజు వర్కౌట్ మొదలుపెట్టాడు. పుష్ప నార్త్ ఇండియా లో ఓ రేంజ్ లో హిట్ కావడంతో ఇప్పుడు అక్కడి రికార్డులను బ్రేక్ చేయాలని పట్టుదలగా ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. పంజాబ్ లో కూడా ఒక ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. అలాగే ముంబై, గుజరాత్ లో కూడా ఈవెంట్ ప్లాన్ చేశారు.

చెన్నైలో కూడా గ్రాండ్ గా ఈవెంట్ చేయనున్నారు. తమిళంలో కూడా సినిమాలు నిర్మిస్తున్న దిల్ రాజు ఈ సినిమా కోసం అక్కడి స్టార్ నిర్మాతలతో ఇప్పటికే చర్చలు కూడా జరిపాడు. ఈ మధ్యకాలంలో కాస్త తెలుగు సినిమాల డామినేషన్ తమిళ సినిమాను ఇబ్బంది పెట్టడం కలవరపెడుతోంది. దీనితో దిల్ రాజు ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకున్నాడు. పుష్ప సినిమా తమిళంలో మలయాళం లో పెద్దగా ఆడలేదు. కేవలం నార్త్ ఇండియా డామినేషన్ తోనే ఆ సినిమా వసూళ్లు సాధించింది. దీనితో తమిళంలో మలయాళంలో ఎక్కువగా ప్రమోషన్స్ ప్లాన్ చేసేందుకు దిల్ రాజు వర్కౌట్ చేస్తున్నాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్