Wednesday, March 25, 2026 02:58 AM
Wednesday, March 25, 2026 02:58 AM

పాకిస్థాన్‌ లోనూ ‘ధురంధర్’ విధ్వంసం

గత ఏడాది డిసెంబర్ 4ను బాలీవుడ్ చరిత్రలో ఒక కీలకమైన రోజుగా చెప్పుకోవచ్చు. కారణం.. సౌత్ ఇండస్ట్రీ నుంచి వరుసగా వస్తున్న క్రేజీ కంటెంట్ సినిమాలు, కేవలం దేశీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా బాలీవుడ్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటూ, అక్కడ ఆధిపత్యం చెలాయించడమే. అలాంటి పరిస్థితుల్లో విడుదలైన చిత్రం ‘ధురంధర్’ (Dhurandhar) బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం సాధారణమైనది కాదు. థియేటర్లలో అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ వేదికగా కూడా అదే స్థాయిలో తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై వారం రోజులు గడిచినా, ఇప్పటికీ డీసెంట్ స్థాయి వ్యూస్‌తో ముందుకు సాగుతోంది.

Also read : పెనుమార్పులు దిశగా ఏపి రాజకీయాలు

సింగిల్ వెర్షన్‌లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹1370 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ముఖ్యంగా, సౌత్ సినిమాలు అన్ని భాషల్లో కలిపి రాబట్టే వసూళ్లను, ఈ చిత్రం కేవలం ఒక్క భాష నుంచే రాబట్టడం విశేషం. ఓటీటీ పరంగా చూస్తే, విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రానికి 73 లక్షల వ్యూస్ నమోదయ్యాయి. భారత్‌లోనే కాకుండా, ఏకంగా 22 దేశాల్లో టాప్–1 స్థానంలో ఈ చిత్రం కొనసాగుతోంది. ఆశ్చర్యకరంగా, ఇందులో మన శత్రు దేశమైన పాకిస్థాన్ కూడా ఉంది. మొదటి వారం రోజుల్లోనే పాకిస్థాన్ నుంచి 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చినట్లు సమాచారం. ఈ సినిమాకు వచ్చిన ఈ స్థాయి స్పందనకు ప్రధాన కారణం.. చిత్రంలో చూపించిన కంటెంట్.

పాకిస్థాన్‌లోని రాజకీయ పరిస్థితులు, అక్కడ వేళ్లూనుకున్న ఉగ్రవాదం, అలాగే భారత్‌పై జరిగిన ఉగ్రదాడులను దర్శకుడు ఆదిత్య డర్ అత్యంత ప్రభావవంతంగా తెరపై ఆవిష్కరించాడు. ఇదే కారణంతో, తమ దేశాలకు వ్యతిరేకంగా సినిమా తీర్చిదిద్దారన్న భావనతో కొన్ని మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఈ చిత్రాన్ని బ్యాన్ చేశారు. అయినప్పటికీ, ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ చిత్రానికి దాదాపు ₹300 కోట్ల గ్రాస్ వసూళ్లు రావడం గమనార్హం. ఒకవేళ మిడిల్ ఈస్ట్‌లో కూడా సినిమా విడుదలై ఉంటే, ఓవర్సీస్ వసూళ్లు ₹500 కోట్ల మార్క్‌ను దాటేవి అన్నది ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. అక్కడ థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో భారీ సంఖ్యలో ఈ చిత్రాన్ని వీక్షిస్తున్నారని సమాచారం.

Also read : నమ్మకం లేదు.. కానీ అదే నిజం.. ఇదే లాజిక్కు..!

ప్రస్తుత ట్రెండ్‌ను పరిశీలిస్తే, నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ‘ధురంధర్ 2’ వచ్చే ఏడాది మార్చి 19న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఓటీటీ వేదికపై ‘ధురంధర్’ సాధిస్తున్న రెస్పాన్స్‌ను బట్టి చూస్తే, సీక్వెల్ మొదటి వారంలోనే ₹1000 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: డేంజర్ జోన్...

ఏపీలోని బెజవాడ నగరం వేదికగా సాగుతున్న...

బ్రేకింగ్: మాట నిలబెట్టుకున్న...

గత కొన్ని రోజులుగా విమర్శలు ఎదుర్కొంటున్న.....

ఏపీపై రైల్వే శాఖ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి...

బాబోయ్.. బెజవాడలో ఉగ్రవాదులు..!

విజయవాడ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విజయవాడలో...

బ్రేకింగ్: ఐటీ రంగంపై...

అమెరికా, ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం...

దానంపైనే బీఆర్ఎస్ గురి..?...

2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత.....

పోల్స్