Monday, October 27, 2025 10:34 PM
Monday, October 27, 2025 10:34 PM
roots

దమ్ముంటే పట్టుకో.. పుష్ప వార్నింగ్..!

అల్లు అర్జున్ టైమ్ అస్సలు బాగున్నట్లు లేదు. తాడు పట్టుకున్నా సరే… అది తాచుపామై కరుస్తోంది. ఫ్యాన్స్ కోసం పైకి లేచి చెయ్యి ఊపితే.. పోలీసులు కేసు పెట్టి ఓ రాత్రి అంతా లోపలేశారు. ఆ తర్వాత నుంచి బన్నీకి అన్నీ కష్టాలే. ఏమైంది బన్నీ అని వచ్చి పరామర్శించినందుకు కావాల్సినన్ని విమర్శలు మూటగట్టుకున్నారు. ఈ విషయం ఇప్పుడు అసెంబ్లీ వరకు చేరుకోవడంతో బన్నీ కష్టాలు మరింత పెరిగాయి. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలంటూ హైదరాబాద్ పోలీసులు ఏకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అలాగే బన్నీని మరోసారి చిక్కడపల్లి పోలీసులు విచారించారు కూడా. అయితే ఇక్కడే పుష్ప సినిమా హీరోకు మరిన్ని కష్టాలు వచ్చాయి.

Also Read : షమీ వెడ్స్ సానియా.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

తెలిసి జరిగిందో… లేక యాదృచ్ఛితమో తెలియదు కానీ… సరిగ్గా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో బన్నీ విచారణ జరుగుతున్నప్పుడే యూ ట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్ అయ్యింది. అదే ఇప్పుడు అటు ప్రభుత్వంలో, పోలీసుల్లో, సినీ పరిశ్రమలో, బన్నీ ఫ్యాన్స్‌లో, ప్రతిపక్షంలో కూడా హాట్ టాపిక్‌గా మారింది. పుష్ప 2 సినిమాకు సంబంధించిన పాటలను టీ సిరీస్ సంస్థ ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది. ఇప్పటికే సినిమా పాటలు సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. అయితే సినిమాలో ఒక డైలాగ్ కూడా ఇప్పుడు టీ సిరీస్ సంస్థ రిలీజ్ చేయడం సంచలనంగా మారింది.

Also Read : కూటమి నేతలకు ఎగ్జాం టైం.. 20 రోజుల్లో పాస్ అవ్వాలి…!

పుష్ప 2 సినిమాలో ఎస్పీ షికావత్‌కు పుష్ప సారీ చెప్పే సీన్ ఉంటుంది. అయితే సారీ చెప్పిన తర్వాత ఈగో హర్ట్ అయిన పుష్ప మళ్లీ వెనక్కి వచ్చి… షికావత్‌తో ఓ డైలాగ్ చెప్తాడు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో టీ సిరీస్ రిలీజ్ చేసింది. దమ్ముంటే పట్టుకోరా షికావత్.. అంటూ రిలీజ్‌ అయిన డైలాగ్‌ సాంగ్ ఇప్పుడు రిలీజ్ చేయడం ఓ సంచలనంగా మారింది. ఓ వైపు విచారణ జరుగుతుంటే… ఈ డైలాగ్ సాంగ్ రావటంతో హాట్ టాపిక్‌గా మారింది. ఈ డైలాగ్ సాంగ్ సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి అల్లు అర్జున్ అన్నట్లుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అల్లు అర్జున్‌ను దమ్ముంటే పట్టుకో రేవంత్ అని అటు బీఆర్ఎస్, ఇటు వైసీపీ సోషల్ మీడియా సెటైర్లు వేస్తోంది. ఇక కొందరైతే… అసలే బన్నీ టైమ్ బాగలేదు… ఇలాంటి టైమ్‌లో ఈ డైలాగ్ సాంగ్ అవసరమా అని ట్రోల్ చేస్తున్నారు. ఇంకొంత మంది అయితే చేసుకున్న వాడికి చేసుకున్నంత అనే మాట ఇప్పుడు సరిగ్గా సరిపోతుందని చెబుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్