Wednesday, February 4, 2026 12:23 PM
Wednesday, February 4, 2026 12:23 PM

ఆపరేషన్ అరణ్య.. రంగంలోకి పవన్..!

అటవీ భూములను రక్షించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. ఆపరేషన్ అరణ్య పేరుతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఇన్ని రోజులు ఆక్రమణలకు గురైన అటవీ భూములను పవన్ స్వయంగా పరిశీలించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నేరుగా సంబంధం ఉందని పవన్ ఆరోపించారు. మంగళం పేట అటవీ భూముల్లో ఏకంగా 76.74 ఎకరాల ఆక్రమణకు గురయ్యాయని..వీటికి మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధం ఉందన్నారు. ఈ అటవీ భూముల ఆక్రమణపై సమగ్ర దర్యాప్తునకు పవన్ ఆదేశించారు.

Also Read : ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. వామ్మో..!

నాలుగు రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో పర్యటించిన పవన్.. తూర్పు కనుమలల్లోని రక్షిత మంగళం పేట అటవీ భూముల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ సమయంలో ఎర్ర చందనం స్మగ్లింగ్‌తో పాటు అటవీ భూముల ఆక్రమణపై పవన్ సమీక్ష నిర్వహించారు. విలువైన అటవీ భూములు ఆక్రమణకు గురైనట్లు పవన్ స్వయంగా వెల్లడించారు కూడా. రెండు రోజుల్లోనే దానికి సంబంధించిన పూర్తి వీడియో రిలీజ్ చేస్తామన్నారు. అన్నట్లుగానే సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక ఏరియల్ సర్వే వీడియోను పవన్ విడుదల చేశారు.

రక్షిత మంగళం పేట అటవీ భూముల ఆక్రమణతో అటవీ శాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధం ఉందన్నారు పవన్. ఇదే విషయాన్ని రెండు రోజుల క్రితం జరిగిన క్యాబినెట్ భేటీలో నేరుగా సీఎం చంద్రబాబుతో పాటు సహచర మంత్రులకు కూడా పవన్ వివరించారు. దీనిపై వెంటనే సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆదేశించారు. మొత్తం 76.74 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు పవన్ తెలిపారు. అటవీ భూమి లాక్కున్న ఎవరికైనా ఎలాంటి మినహాయింపులు లేకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు.

Also Read : జగన్ చుట్టూ ఏం జరుగుతోంది..? రౌండప్ అవుతున్నారా..? భూకంపం సృష్టిస్తున్న అత్యంత సన్నిహితులు..!

అటవీ భూముల ఆక్రమణపై అధికారులకు పవన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అటవీ భూమి ఆక్రమణదారులందరి పేర్లను శాఖ వెబ్‌సైట్‌లో ఉంచాలన్నారు. అలాగే ప్రతి వ్యక్తిపై ఆక్రమణ పరిధి, కేసుల స్థితిని వెల్లడించాలని సూచించారు. అటవీ భూమిని స్వాధీనం చేసుకున్న ఎవరిపైన అయినా సరే.. మినహాయింపులు లేకుండా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. భూ రికార్డుల్లో వ్యత్యాసాలను దర్యాప్తు చేయాలన్న పవన్.. వాటిలో వెబ్ ల్యాండ్ ఎంట్రీలు, రక్షిత అటవీ ప్రాంతాల్లో పూర్వీకుల భూమి అనే తప్పుడు వాదనలు ఉన్నాయని గుర్తు చేశారు. విజిలెన్స్ నివేదికలు, న్యాయ నిపుణుల మార్గ దర్శకత్వం ఆధారంగా చర్య తీసుకోవాలని పవన్ ఆదేశించారు. అన్ని భూ రికార్డులను డిజిటలైజ్ చేసి అవకతవకలు నిరోధించి పారదర్శకతను నిర్ధారించాలని సూచించారు. అటవీ భూములు జాతీయ ఆస్తులు. వాటిని ఆక్రమించిన, దుర్వినియోగం చేసిన లేదా అటవీ చట్టాలను ఉల్లంఘించిన వారు, వారు ఎవరైనా సరే, జవాబుదారీగా ఉంటారు. రక్షిత అటవీ ప్రాంతాలు లేదా వన్యప్రాణుల మండలాలను ఆక్రమించడాన్ని ప్రభుత్వం సహించదు.. అంటూ పవన్ హెచ్చరించారు. ఆపరేషన్ అరణ్య అంటూ పవన్ హ్యాష్ ట్యాగ్ పెట్టారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

పోల్స్