దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కలను తొలగించాలనే నిర్ణయం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఇది క్రమంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి వరకు వెళ్ళడం సంచలనంగా మారింది. గుజరాత్ కు చెందిన ఓ వ్యక్తి రేఖాపై ఈ రోజు ఉదయం దాడికి దిగినట్టు జాతీయ మీడియా వెల్లడించింది. దాడి చేసిన వ్యక్తిని గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన రాజేష్ సక్రియగా గుర్తించారు. ఢిల్లీ పోలీసులు అతని కుటుంబ సభ్యులను సంప్రదించగా, అతని తల్లి భాను మీడియాతో మాట్లాడారు.
Also Read : వాళ్ళను చంద్రబాబు వదలరు.. అసెంబ్లీలో కొత్త చట్టం
తన కొడుకు రాజేష్ కుక్కల ప్రేమికుడని, ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో వీధి కుక్కలను పట్టుకుని షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై కలత చెందినట్టు చెప్పుకొచ్చారు. కాగా 41 ఏళ్ల సకారియా తన బంధువును అరెస్టు చేయడంపై, ముఖ్యమంత్రి సహాయం కోరేందుకు అక్కడికి వెళ్లినట్టు మరికొన్ని వార్తలు వచ్చాయి. ఢిల్లీ పోలీసులు మాత్రం దీనిపై ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. అతని తల్లి వ్యాఖ్యల ప్రకారం సుప్రీం తీర్పు వచ్చిన తర్వాత అతను ఢిల్లీ వెళ్లినట్టు జాతీయ మీడియా వెల్లడించింది.
Also Read : ఆ విషయంలో వైసీపీ స్టాండ్ ఏమిటో..?
ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం, సక్రియా కొన్ని పత్రాలు తీసుకుని ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో గట్టిగా కేకలు వేస్తూ ఆమెపై దాడికి దిగాడట. కొందరి వ్యాఖ్యల ప్రకారం, అతను ఆ సమయంలో తాగి ఉన్నాడని జాతీయ మీడియా వెల్లడించింది. ప్రస్తుతం అతనిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు. ముఖ్యమంత్రి గుప్తా ఈ రోజు ఉదయం తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఆ సమయంలో ఈ దాడి జరిగింది. ఇక ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని అనుమానిస్తున్నట్లు బిజెపి పేర్కొంది. ఆమె ప్రజలతో మమేకం కావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని ఆ రాష్ట్ర మంత్రులు ఆరోపిస్తున్నారు.