ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే పలు కంపెనీలకు భూ కేటాయింపులు చేసిన సర్కార్.. కాంట్రాక్ట్ సంస్థలకు సైతం పనులు వేగంగా అప్పగించింది. అమరావతి నిర్మాణం ఊపందుకుంది. అక్కడ మూడు షిప్టుల్లో కార్మికులు పనిచేస్తున్నారు. మొత్తం పది వేల మంది అమరావతి నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు. రాబోయే మూడేళ్ళలో దాదాపుగా పనులు పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.
Also Read : టీడీపీ, వైసీపీ మధ్య సెక్యూరిటీ వార్..!
త్వరలో కార్మికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ భవనాలకు సంబంధించి గతంలో నిలిచిపోయిన పనులకు మళ్లీ టెండర్లు వేసి మొదలుపెడుతున్నారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన తర్వాత కొన్ని రోజులకే పనులు ఊపందుకున్నాయి. ప్రభుత్వ నిర్మాణాలతోపాటు ప్రైవేటు కంపెనీలు కూడా వాటికి కేటాయించిన స్థలాల్లో పనులు మొదలుపెడుతున్నాయి. స్థలాలు పొందిన ప్రతి ఒక్కరికీ.. పనులు మొదలుపెట్టేందుకు ఆరు నెలల సమయం ఇచ్చింది సర్కార్. ఈ లోపు పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించకపోతే స్థలాలను రద్దు చేయనున్నారు.
Also Read : సింగయ్య మృతి ప్రభుత్వ వైఫల్యమా లేక వైసీపీ నిర్లక్ష్యమా?
గెయిల్ ఇండియా, అంబికా దర్బార్ బత్తి కంపెనీలు వంటి కంపెనీలకు ఇప్పటికే స్థలాలను రద్దు చేశారు. చాలా కంపెనీలు ఆరు నెలల్లో పనులు మొదలుపెట్టేందుకు సిద్దంగా ఉన్నాయి. రెండు, మూడేళ్లలో విజుబుల్ డెవలప్మెంట్ ను అమరావతిలో ప్రజల ముందు ఉంచాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో అమరావతి విస్తరణ ప్రణాళికను కూడా అమలు చేస్తోంది ప్రభుత్వం. ఎయిర్ పోర్టుతో పాటు వివిధ సంస్థలకు అవసరమైన భూమిని.. భూమీకరణలో సేకరించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

