Wednesday, February 4, 2026 09:46 PM
Wednesday, February 4, 2026 09:46 PM

ఈరోజు (31-10-2025) రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయణం, శరదృతువు, శుక్లపక్షం 31-10-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి.

మేషం 31-10-2025

వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత అధికమవుతుంది. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు వస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగాలు ఊహించని స్థానచలన సూచనలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

—————————————

వృషభం 31-10-2025

నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు.

—————————————

మిధునం 31-10-2025

వ్యాపార వ్యవహారాలలో సొంత నిర్ణయాలు కలసి వస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటాబయట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.

—————————————

కర్కాటకం 31-10-2025

చేపట్టిన పనుల్లో అవాంతరాలు చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

—————————————

సింహం 31-10-2025

కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యయ ప్రయాసలతో కొన్ని పనులు పూర్తి కావు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. వృధా ఖర్చులు విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

—————————————

కన్య 31-10-2025

ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

—————————————

తుల 31-10-2025

సమాజంలో ప్రత్యేక గౌరవ మర్యాదలు పొందుతారు. నిరుద్యోగులు ఆశించిన పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

—————————————

వృశ్చికం 31-10-2025

కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. వృత్తి, ఉద్యోగాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు మందగిస్తాయి.

—————————————

ధనస్సు 31-10-2025

బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. ఉద్యోగ స్థానచలన సూచనలున్నాయి. వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

—————————————

మకరం 31-10-2025

చిన్న నాయుడు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.

—————————————

కుంభం 31-10-2025

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. చేపట్టిన పనులలో కొంత జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో సమస్యలు తప్పవు. బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. ధన పరంగా ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగమున అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది.

—————————————

మీనం 31-10-2025

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగమున మీ పనితీరుతో అధికారులను సైతం ఆకట్టుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాల్లో అంచనాలు నిజం కాగలవు. పనులు చకచకా పూర్తి చేస్తారు.

—————————————

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్