Wednesday, February 4, 2026 04:25 PM
Wednesday, February 4, 2026 04:25 PM

ఈరోజు (29-11-2025) మీ రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం 29-11-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి.

మేషం 29-11-2025

వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఇతరుల నుండి సమస్యలు తప్పవు. నూతన ఋణాలు చేస్తారు. వృధా ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి. దైవ చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి.

—————————————

వృషభం 29-11-2025

ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. అన్ని రంగాల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది. విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్న నాటి మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

—————————————

మిధునం 29-11-2025

వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృథా ఖర్చులు చేదాటుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు పరుస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబసభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

—————————————

కర్కాటకం 29-11-2025

ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ఇంటా బయట నూతన పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. స్నేహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

—————————————

సింహం 29-11-2025

గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగస్తులకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో శుభ కార్యాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.

—————————————

కన్య 29-11-2025

బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సోదరులతో ఒక వ్యవహారంలో సఖ్యత లోపిస్తుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

—————————————

తుల 29-11-2025

ఉద్యోగస్తులకు నిరుత్సాహం తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన కార్యక్రమాలు నిరాశ కలిగిస్తాయి. పనులలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

—————————————

వృశ్చికం 29-11-2025

అందరిలోనూ గుర్తింపు పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో సఖ్యత కలుగుతుంది. లాభాల బాటలో సాగుతాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది.

—————————————

ధనస్సు 29-11-2025

ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమౌతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అందరిలోనూ పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి.

—————————————

మకరం 29-11-2025

ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నవి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. స్నేహితులతో విభేదాలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలలో ఆటుపోట్లు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృధా ఖర్చులు విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది.

—————————————

కుంభం 29-11-2025

దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. నూతన వాహనయోగం ఉన్నది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.

—————————————

మీనం 29-11-2025

సంతానం వివాహ ప్రయత్నాలు అనుకూలించవు. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు తప్పవు. బంధువులతో విభేదాలు కొంత బాధిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

—————————————

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్