Wednesday, February 4, 2026 10:26 PM
Wednesday, February 4, 2026 10:26 PM

ఈరోజు (18-10-2025) రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయణం, శరదృతువు, శుక్లపక్షం 18-10-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి.

మేషం 18-10-2025

వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగతాయి. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. విలువైన వస్తు, వస్త్ర లాభాలు అందుతాయి. నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి.

—————————————

వృషభం 18-10-2025

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి.

—————————————

మిధునం 18-10-2025

ఆరోగ్య పరంగా చికాకులు తప్పవు. సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

—————————————

కర్కాటకం 18-10-2025

వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. బంధు మిత్రులతో సఖ్యత కలుగుతుంది. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం పొందుతారు. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది.

—————————————

సింహం 18-10-2025

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాల వలన మార్గ అవరోధాలు కలుగుతాయి.

—————————————

కన్య 18-10-2025

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

—————————————

తుల 18-10-2025

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార, ఉద్యోగాలలో ఇబ్బందులు తప్పవు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు పరుస్తాయి.

—————————————

వృశ్చికం 18-10-2025

మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

—————————————

ధనస్సు 18-10-2025

చిన్ననాటి మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. సంఘంలో పేరు కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి.

—————————————

మకరం 18-10-2025

ధనపరంగా ఇబ్బందులు తప్పవు. చేపట్టిన వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వృధా ప్రయాణాలు చేస్తారు.

—————————————

కుంభం 18-10-2025

ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. చేపట్టిన పనులు మందగిస్తాయి. వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు తప్పవు. నూతన రుణయత్నాలు చెయ్యవలసి వస్తుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

—————————————

మీనం 18-10-2025

వ్యాపారాలలో ఆశించిన రీతిలో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వాహనయోగం ఉన్నది. ఉద్యోగయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున జీతబత్యముల విషయంలో శుభవార్తలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

————————————-

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్