Sunday, March 22, 2026 10:12 AM
Sunday, March 22, 2026 10:12 AM

ఈరోజు (16-11-2025) మీ రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం 16-11-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి.

మేషం 16-11-2025

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. సన్నిహితుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

—————————————

వృషభం 16-11-2025

చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

—————————————

మిధునం 16-11-2025

బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి.

—————————————

కర్కాటకం 16-11-2025

వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. కీలక సమయంలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు.

—————————————

సింహం 16-11-2025

వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు తప్పవు. ఆరోగ్యపరంగా వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృధా ఖర్చులు అదుపు చేయడం మంచిది.

—————————————

కన్య 16-11-2025

కుటుంబమునకు ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషానిస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది.

—————————————

తుల 16-11-2025

వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు తప్పవు. వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు.

—————————————

వృశ్చికం 16-11-2025

ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు.

—————————————

ధనస్సు 16-11-2025

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ధన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

—————————————

మకరం 16-11-2025

వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. ఆదాయ మార్గాలు అంతంతమాత్రంగా ఉంటాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు.

—————————————

కుంభం 16-11-2025

వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దాని పరంగా ఇబ్బందులు తప్పవు.

—————————————

మీనం 16-11-2025

దూరపు బంధువుల ఆగమనం కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కీలక సమయంలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి.

—————————————

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్