Monday, March 23, 2026 08:19 AM
Monday, March 23, 2026 08:19 AM

ఈరోజు (15-11-2025) మీ రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం 15-11-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి.

మేషం 15-11-2025

వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. పాత రుణాలు తీర్చగలుగుతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

—————————————

వృషభం 15-11-2025

స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి.

—————————————

మిధునం 15-11-2025

ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు. మాతృ సంభంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. బంధువర్గంతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

—————————————

కర్కాటకం 15-11-2025

విలువైన గృహాపకరణాలు బహుమతులుగా పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి.

—————————————

సింహం 15-11-2025

ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

—————————————

కన్య 15-11-2025

వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి.

—————————————

తుల 15-11-2025

ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. కుటుంబసభ్యులతో వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కలసిరావు.

—————————————

వృశ్చికం 15-11-2025

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

—————————————

ధనస్సు 15-11-2025

స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానానికి విద్యా ఉద్యోగ అవకాశములు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరువుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

—————————————

మకరం 15-11-2025

దూరప్రయాణాలు వలన శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు.

—————————————

కుంభం 15-11-2025

కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

—————————————

మీనం 15-11-2025

ఆలయ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇతరులతో వివాదాల పరిష్కారం అవుతాయి.

—————————————

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్