Wednesday, February 4, 2026 10:52 AM
Wednesday, February 4, 2026 10:52 AM

ఈరోజు (13-12-2025) మీ రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం 13-12-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి…

మేషం 13-12-2025

కొన్ని పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నూతన రుణాలు చేస్తారు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. జీవిత భాగస్వామితో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

—————————————

వృషభం 13-12-2025

కొన్ని వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విలువైన వస్తు,వస్త్ర లాభాలు పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

—————————————

మిధునం 13-12-2025

దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. రాజకీయ సంభంధిత సభ, సమావేశాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి.

—————————————

కర్కాటకం 13-12-2025

గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. స్థిరస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో అందుతాయి.

—————————————

సింహం 13-12-2025

కుటుంబ సభ్యులతో చర్చలు సఫలమౌతాయి. వ్యాపారమున స్వంత నిర్ణయాలతో ముందుకు సాగడం మంచిది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకులిస్తాయి. బంధువులతో మాటపట్టింపులు తొలగుతాయి.

—————————————

కన్య 13-12-2025

ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు జ్ఞాప్తికి వస్తాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో సఖ్యత కలుగుతుంది.

—————————————

తుల 13-12-2025

ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఇంటాబయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

—————————————

వృశ్చికం 13-12-2025

దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నూతన వాహనయోగం ఉన్నది. భూవివాదాల పరిష్కారమౌతాయి. విద్యార్థులకు అనుకూలR ఫలితాలు ఉంటాయి.

—————————————

ధనస్సు 13-12-2025

కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. సోదరులతో సఖ్యత లోపిస్తుంది. కుటుంబ సభ్యులతో కొద్దిపాటి సమస్యలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. దైవచింతన పెరుగుతుంది. బంధు మిత్రులతో అకారణ వివాదాలుంటాయి.

—————————————

మకరం 13-12-2025

చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమౌతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ధన, వస్తువులు బహుమతులుగా పొందుతారు.

—————————————

కుంభం 13-12-2025

వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విందువినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.

—————————————

మీనం 13-12-2025

వృత్తి వ్యాపారలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. బంధువులతో తగాదాలు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. నూతన రుణాలు చేస్తారు.

—————————————

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్