Wednesday, February 4, 2026 09:23 PM
Wednesday, February 4, 2026 09:23 PM

ఈరోజు (06-11-2025) రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయణం, శరదృతువు, శుక్లపక్షం 06-11-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి.

మేషం 06-11-2025

భాగస్వామ్య వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఉంటాయి. దూరప్రయాణాల వలన తగిన విశ్రాంతి ఉండదు. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో చిన్నపాటి వివాదాలు తప్పవు.

—————————————

వృషభం 06-11-2025

నూతన వాహన సౌక్యం ఉన్నది. ఆర్థిక వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

—————————————

మిధునం 06-11-2025

చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయలేరు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మీ కష్టం ఫలించదు.

—————————————

కర్కాటకం 06-11-2025

ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ముఖ్యమైన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. సన్నిహితులు, వివాదాలు సర్దుబాటు కాగలవు.

—————————————

సింహం 06-11-2025

ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. విద్యా విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు.

—————————————

కన్య 06-11-2025

వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట బాధ్యతలతో భారంగా మారతాయి. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి.

—————————————

తుల 06-11-2025

ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. బంధువర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. కొన్ని పనులలో రెండు రకములైన ఆలోచనలతో నష్టాలు తప్పవు.

—————————————

వృశ్చికం 06-11-2025

వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

—————————————

ధనస్సు 06-11-2025

నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమౌతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.

—————————————

మకరం 06-11-2025

వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో ఆస్థి వివాదాలు చికాకు పరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

—————————————

కుంభం 06-11-2025

ఒక విషయంలో బంధువర్గం నుండి విమర్శలు తప్పవు. ఇతరుల పై మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచిది. కొన్ని వ్యవహారాలలో మీ అంచనాలు తప్పుతాయి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. ప్రయాణాలు వాయిదా పడతాయి.

—————————————

మీనం 06-11-2025

నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో మీ సేవలకు గుర్తింపు పొందుతారు. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

—————————————

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్