Wednesday, February 4, 2026 02:33 PM
Wednesday, February 4, 2026 02:33 PM

ఈరోజు (26-12-2025) మీ రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, హేమంత ఋతువు, పుష్య మాసం, శుక్ల పక్షం, 26-12-2025 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి…

మేషం 26-12-2025

స్ధిరాస్తి ఒప్పందాలలో పునరాలోచన చేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన వ్యవహారాలు కొంత మందకోడిగా సాగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్న పాటి వివాదాలు ఉంటాయి.

—————————————

వృషభం 26-12-2025

నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్ధిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సోదరులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు.

—————————————

మిధునం 26-12-2025

గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు.

—————————————

కర్కాటకం 26-12-2025

చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. చేపట్టిన పనులలో నూతన ప్రణాళికలు అమలుపరచి సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. కుటుంబ పెద్దలతో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి.

—————————————

సింహం 26-12-2025

భూ సంబంధిత వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి. గృహమున కొందరి ప్రవర్తన వలన మానసికంగా ఇబ్బందికి గురవుతారు.

—————————————

కన్య 26-12-2025

దైవ సేవా కార్యాక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి.

—————————————

తుల 26-12-2025

నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చేవిధంగా ఉండవు. వాహన సంభందమైన సమస్యలు కలుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నలాలో అవరోధాలు తొలగుతాయి. వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అమలు పరచడం మంచిది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలుంటాయి.

—————————————

వృశ్చికం 26-12-2025

శత్రు సమస్యలు తొలగుతాయి.ఆదాయ మార్గాలు సంతృప్తికరంగా సాగుతాయి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. బంధువులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.

—————————————

ధనస్సు 26-12-2025

గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అంది అవసరాలు తీరుతాయి. వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలుంటాయి.

—————————————

మకరం 26-12-2025

నిరుద్యోగులకు చాలాకాలంగా వేచి చూస్తున్న అవకాశములు అందుతాయి. పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. సేవ కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

—————————————

కుంభం 26-12-2025

సన్నిహితుల నుండి అందిన ఒక వార్త ఉత్సాహం కలిగిస్తుంది. అన్ని రంగాల వారికీ అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టే పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేస్తారు.

—————————————

మీనం 26-12-2025

కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికం అవుతుంది. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు ఫలించవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దీర్ఘకాలిక ఋణ భారం అధికమౌతుంది. బంధు మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

—————————————

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్