Sunday, March 22, 2026 01:31 PM
Sunday, March 22, 2026 01:31 PM

ఈరోజు (04-01-2026) మీ రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, హేమంత ఋతువు, పుష్య మాసం, శుక్ల పక్షం 04-01-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి…

మేషం 04-01-2026

ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు పనిచేయవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సంతాన విషయంలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తప్పవు.

—————————————

వృషభం 04-01-2026

ఆర్ధిక పరిస్థితి గంధరగోళంగా ఉంటుంది. తల్లిదండ్రులు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయం లభించదు. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

—————————————

మిధునం 04-01-2026

విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటాబయటా కీలక నిర్ణయాలను అమలు పరుస్తారు. ఆదాయ మార్గాలు విస్తృతమౌతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారపరంగా స్థిరమైన లాభాలు అందుకుంటారు. దీర్ఘ కాలిక ఋణాల నుండి ఊరట పొందుతారు.

—————————————

కర్కాటకం 04-01-2026

ఆర్థికంగా ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. అకారణంగా ఇతరులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

—————————————

సింహం 04-01-2026

గృహమున శుభాకార్యములు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి. కుటుంబ సభ్యులతో విందువినోదాలు కార్యక్రమాలలో పాల్గొంటారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది.

—————————————

కన్య 04-01-2026

వృధా ఖర్చుల విషయంలో ఆలోచించి ముందుకు ముందుకు సాగాలి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సమయానికి నిద్ర హారాలు ఉండవు. వ్యాపార పరంగా స్వలప ధన నష్ట సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురి కావల్సి వస్తుంది.

—————————————

తుల 04-01-2026

నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. గృహ నిర్మాణ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటాబయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. అవసరానికి ఆప్తుల నుండి ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది.

—————————————

వృశ్చికం 04-01-2026

ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో కుటుంబ పెద్దల ఆలోచనలు కలసివస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులుంటాయి.

—————————————

ధనస్సు 04-01-2026

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల మాటలు కొంత మానసికంగా కలచివేస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. మానసిక ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.

—————————————

మకరం 04-01-2026

వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారపరంగా ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చేయని పనికి నిందలు పడవలసి వస్తుంది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

—————————————

కుంభం 04-01-2026

కీలక సమయంలో జీవితభాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. నూతన గృహ వాహనయోగం ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుండి తెలివిగా బయటపడతారు.

—————————————

మీనం 04-01-2026

చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఆనందం కలిగిస్తుంది. స్ధిరాస్తి క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

—————————————

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్