శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం 03-01-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి…
మేషం 03-01-2026
వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు అదుపుచేయడం కష్టంగా మారుతుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మాటలు వివాదాస్పదంగా మారుతాయి.
—————————————
వృషభం 03-01-2026
ధనాదాయ విషయాలలో లోటుపాట్లు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు దర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకోని సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయటం మంచిది.
—————————————
మిధునం 03-01-2026
నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. సమాజంలో ప్రముఖ వ్యక్తుల ఆదరణ పెరుగుతుంది. శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
—————————————
కర్కాటకం 03-01-2026
చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. సంతాన ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాల వలన ధనవ్యయం కలుగుతుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటాబయట ప్రతికూల వాతావరణం ఉంటుంది.
—————————————
సింహం 03-01-2026
ఉద్యోగాలలో అధికారులతో ఉన్న సమస్యలు రాజీ చేసుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది.
—————————————
కన్య 03-01-2026
నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడుతాయి. ధనపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబమున అనిశ్చిత కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారములలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యలేరు.
—————————————
తుల 03-01-2026
వ్యాపారంలో ఆశించిన ఫలితాలుంటాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్య సిద్ది కలుగుతుంది. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అనుకున్న సమయానికి పనులు పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. మొండి బాకీలు వసూలు అవుతాయి.
—————————————
వృశ్చికం 03-01-2026
వ్యాపార పరంగా అభివృద్ధి సాధిస్తారు. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
—————————————
ధనస్సు 03-01-2026
ఉద్యోగస్థులకు ఊహించని స్థాన చలనాలుంటాయి. ఇతరులతో నిదానంగా వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి.
—————————————
మకరం 03-01-2026
బంధుమిత్రులతో శుభకార్య విషయమై చర్చలు చేస్తారు. కుటుంబ సభ్యుల మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపారపరంగా ఆశించిన ఫలితాలు ఉండవు. ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులుంటాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
—————————————
కుంభం 03-01-2026
సమాజంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అధికారుల నుండి అనుకూలత పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తికి సంభందిత వివాదాలలో విజయం సాధిస్తారు.
—————————————
మీనం 03-01-2026
కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితులతో దీర్ఘకాలిక వివాదాలను రాజి చేసుకుంటారు. ధనాదాయం బాగుంటుంది. వ్యాపారాలను విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది.
————————————-

