Tuesday, March 24, 2026 03:55 PM
Tuesday, March 24, 2026 03:55 PM

ఈరోజు (15-08-2025) రాశి ఫలితాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయణం వర్ష ఋతువు, శుక్లపక్షం నాడు పన్నెండు రాశుల్లో ఇవాళ (15 ఆగస్టు 2025 గురువారం) ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? ఎవరిపై శని ప్రభావం ఉంటుంది?

మేషం 15-08-2025

సంతాన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగాలలో చికాకులు తప్పవు.

—————————————

వృషభం 15-08-2025

సోదరులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు శ్రమాధిక్యంతో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది.

—————————————

మిధునం 15-08-2025

వాహనయోగం ఉన్నది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. స్థిరస్తి క్రయ విక్రయాలలో పురోగతి కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు కలుగుతాయి.

—————————————

కర్కాటకం 15-08-2025

కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి.

—————————————

సింహం 15-08-2025

వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

—————————————

కన్య 15-08-2025

ఒక వ్యవహారంలో బంధువర్గంతో మాటపడవలసి వస్తుంది. దైవచింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో సమస్యలు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

—————————————

తుల 15-08-2025

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో ప్రతిష్ఠంభనలు తప్పవు. ఆస్తుల వివాదాలు వలన మానసిక సమస్యలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు తప్పవు. మిత్రుల వలన సమస్యలు కలుగుతాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు వాయిదాపడతాయి.

—————————————

వృశ్చికం 15-08-2025

సన్నిహితుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. సంఘములో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగాలలో ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

—————————————

ధనస్సు 15-08-2025

విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. దూరప్రాంతాల మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి.

—————————————

మకరం 15-08-2025

కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సోదరులతో స్థిరస్తి ఒప్పందాలు చేసుకుంటారు. మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఉంటాయి.

—————————————

కుంభం 15-08-2025

ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. సన్నిహితుల నుంచి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి.

—————————————

మీనం 15-08-2025

కుటుంబ సమస్యల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. దైవచింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

—————————————

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: మాట నిలబెట్టుకున్న...

గత కొన్ని రోజులుగా విమర్శలు ఎదుర్కొంటున్న.....

ఏపీపై రైల్వే శాఖ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి...

బాబోయ్.. బెజవాడలో ఉగ్రవాదులు..!

విజయవాడ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విజయవాడలో...

బ్రేకింగ్: ఐటీ రంగంపై...

అమెరికా, ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం...

దానంపైనే బీఆర్ఎస్ గురి..?...

2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత.....

అమరావతికి ఎన్నో ప్రత్యేకతలు..!

హైదరాబాద్‌ను అధిగమించేలా అమరావతిని అభివృద్ధి చేస్తామని...

పోల్స్