Sunday, March 22, 2026 02:36 PM
Sunday, March 22, 2026 02:36 PM

కొడుకు కోసం తల్లి బంగారం అమ్మేసింది.. చివరకు..!

ఐపిఎల్ వేలం పాట అనగానే ఎందరో క్రికెటర్లు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వందలాది మంది ఆటగాళ్ల జీవితాలను మలుపు తిప్పే ఈ టోర్నమెంట్ కోసం.. ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఒక్కొక్కరు లక్కీగా కోట్లు పలుకుతూ ఉంటారు. తాజాగా జరిగిన మినీ వేలంలో కార్తిక్ శర్మ అనే ఆటగాడు ఏకంగా 14 కోట్ల ధర పలికాడు. అప్పటి వరకు అతను ఎవరో కూడా చాలా మందికి తెలియదు. అతనిని చెన్నై జట్టు ఏకంగా 14 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయడంతో పేరు మార్మోగిపోయింది.

Also Read : ఏపీలో ఏం జరుగుతోంది..? ఎమ్మెల్యేలతో పవన్ అత్యవసర సమావేశం..!

ఇక ఇతని జీవితం మొత్తం కూడా కష్టాలే అంటోంది జాతీయ మీడియా. తినడానికి తిండి లేక రాత్రి సమయాల్లో షెల్టర్ లు, బస్టాండ్ లలో అతను పడుకునే వాడని, పస్తులు ఉండి క్రికెట్ కోసం కష్టపడినట్టు వెల్లడించింది. ఇక అతని క్రికెట్ ప్రయాణం గురించి అతని తండ్రి అనేక విషయాలు పంచుకున్నాడు. తమ సొంత ఊర్లో ఉన్న పొలం, ఇతర ఆస్తులను అమ్మేసామని, అతనికి శిక్షణ ఇవ్వడానికి తీవ్రంగా కష్టపడ్డామని చెప్పుకొచ్చాడు. తన భార్య బంగారం కూడా అమ్మేసి.. కిట్ కొనిపెట్టింది అని గుర్తు చేసుకున్నాడు.

Also Read : ఆయన కోసం కొత్త పోస్టు సృష్టిస్తున్నారా..?

చిన్నప్పటి నుంచి కార్తిక్ కు క్రికెట్ అంటే చాలా ఇష్టమని, అందుకే అతను పట్టుదలగా వచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకున్నాడని, ఇప్పుడు వచ్చిన డబ్బుతో తమ కష్టాలు అన్నీ తీరిపోతాయని తెలిపాడు. ఈ ఏడాది ఇంటర్ పూర్తి చేసిన కార్తిక్ శర్మ దేశవాళి క్రికెట్ లో అంచనాలకు మించి రాణించాడు. మంచి హిట్టర్ గా కూడా అతనికి పేరు ఉంది. అతని తండ్రి కూడా ఒకప్పుడు క్రికెటర్ కావడం విశేషం. కానీ.. గాయం కారణంగా క్రికెట్ ను కొనసాగించలేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్