నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా తర్వాత ఇండియా వైడ్ గా ఫేమస్ అయిపోయారు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఆ సినిమాకు చాలా మంచి పాపులారిటీ వచ్చింది. అక్కడ వసూళ్లు కూడా భారీగా రావడంతో ఇప్పుడు చేస్తున్న అఖండ సీక్వెల్.. కూడా నార్త్ ఇండియా ఆడియన్స్ ను టార్గెట్ గా చేసుకుని బోయపాటి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపుగా సగం కంప్లీట్ అయింది. త్వరలోనే మిగిలిన షూటింగ్ కూడా కంప్లీట్ చేసి సెప్టెంబర్ లో సినిమాను విడుదల చేయాలని డైరెక్టర్ టార్గెట్ పెట్టుకున్నారు.
Also Read : మాన్షన్ హౌస్ ను టార్చర్ చేసిన కసిరెడ్డి..?
ఇక ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే క్రేజీ అప్డేట్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంచితే బోయపాటి శ్రీను ఎక్కువగా సినిమాను హిందీ ఆడియన్స్ ను ఫోకస్ చేసి దేవుడికి సంబంధించిన మాస్ డైలాగ్స్ ను రాయిస్తున్నారట. రెండు భాషల్లో ఒకేసారి షూటింగ్ చేయిస్తున్నారట. మహా కుంభమేళా సమయంలో ఉత్తర ప్రదేశ్ లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. దీనితో సినిమాకు నార్త్ ఇండియా మార్కెట్ పెరగాలి అంటే కచ్చితంగా ఆ రేంజ్ డైలాగులు ఉండాలి అని బోయపాటి ప్లాన్ చేసుకున్నారు.
Also Read : వైసీపీ – టీడీపీ మధ్య ప్యాలెస్ వార్..!
ఇక ప్రముఖ హిందీ నటులను కూడా గెస్ట్ పాత్రలో తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. సెకండ్ హాఫ్ లో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అమితాబచ్చన్ కు కీలకపాత్ర ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల్లో అమితాబచ్చన్ నటిస్తున్నారు. ఇక విక్కీ కౌశల్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడు అనే వార్త ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. హిందూ మతాన్ని ఎక్కువగా టార్గెట్ చేసుకునే సినిమాను డైరెక్టర్ ప్లాన్ చేశాడు.