వైఎస్ జగన్ తెనాలి పర్యటన వల్ల ఎవరికి లాభం.. గంజాయ్ బ్యాచ్ అని టీడీపీ నేతలు పదే పదే చెబుతున్నా కూడా.. జగన్ ఎందుకు పరామర్శించారు.. ఇలాంటి రౌడీ షీటర్లను జగన్ ఎందుకు చేరదీస్తున్నారు.. దీని వల్ల వైసీపీకి లాభమా.. నష్టమా.. ఇవే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న ప్రశ్నలు. రౌడీ షీటర్లను పరామర్శించడానికి ఎందుకు జగన్ తెనాలి వెళ్లాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్.
జగన్ తెనాలి పర్యటన వైసీపీ అభ్యర్థులకు ఇబ్బంది కలిగిస్తుందనేది వాస్తవం. రౌడీ షీటర్ల నిజస్వరూపం తెలిసిన తెనాలి వాసులు.. ఇలాంటి వారిని వైసీపీ ప్రొత్సహిస్తుందా అనే కోపంతో.. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉంది. ఇది తెనాలి నియోజకవర్గంలోనే కాదు పక్కనే ఉన్న మరో రెండు, మూడు నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ విషయం ఒక మాజీ ముఖ్యమంత్రికి తెలియదా.. అంటే.. బాగా తెలుసు.. అయినా సరే.. ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది ఓసారి పరిశీలిస్తే.. దీని వెనుక పెద్ద కుట్ర ఉందనేది స్పష్టమవుతుంది.
Also Read : ద్వారంపూడికి మ్యూజిక్ స్టార్ట్ అయినట్టే..?
వాస్తవానికి ఇదేదో దళితులను పరామర్శించి.. ప్రభుత్వాన్ని దళిత వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. దళితులను పరామర్శించటం ద్వారా.. వాళ్ల ఓట్లను తన వైపు తిప్పుకోవచ్చు అనే జగన్ అనుకుంటున్నాడు అనేది పైకి కనిపించే వ్యవహారం. కానీ లోతుగా పరిశీలిస్తే మాత్రం… దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది. ఇంకా చెప్పాలంటే ఇదంతా వైఎస్ ఫ్యామిలీ తొలి నుంచి అనుసరిస్తున్న విధానమే.
ఏపీలో ఎక్కడ క్రైమ్ జరిగినా సరే.. దానికి రాజకీయ నేపథ్యంలో ఎంతో కొంత ఉంటుంది. ఇక నేరస్తులకు ఏదో ఒక విధంగా అండగా ఉండటం వైఎస్ కుటుంబ నైజం. రాజకీయ ముసుగులోనే, నమ్మిన వాళ్లకి అండగా ఉంటాడనే ముసుగులోనో నేరస్తులను చేరదీయడం, పెంచి పోషించడం.. అవసరానికి తమ చేతులకు మట్టి అంటకుండా వాళ్లని వాడుకోవడం కూడా నేర ప్రవృత్తిలో భాగమే. ఇది వైఎస్ కుటుంబానికి బాగా తెలుసు. అందుకే ఇలాంటి క్రిమినల్స్ కోసం ఎంత దూరమైనా వెళ్తారు జగన్.
Also Read : ఈసారి అయినా సార్ బయటకు వస్తారా..?
పులివెందుల చుట్టుపక్కల పల్లెల్లో కొంతమంది ఫ్యాక్షనిస్టులను చేరదీసి.. వాళ్లకు ఆర్థికంగా అండగా నిలిచిన చరిత్ర రాజారెడ్డిది. ఫ్యాక్షనిస్టులను తన మనుషులుగా చేసుకుని ముఠా నాయకుడిగా ఎదిగి.. కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, తాడిపత్రి వంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా దానిని విస్తరించారనేది ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ వినిపించే మాట. వైఎస్ ఫ్యామిలీ ప్రతి గ్రామంలో రెండు ఫ్యాక్షన్ వర్గాలను బ్యాకింగ్ చేసి, ఎలక్షన్ టైంలో రెండు గ్రూప్స్ వైఎస్ ఫ్యామిలీకే ఓటింగ్ ,రిగ్గింగ్ చేసేటట్లు ఒప్పందాలు చేసుకునే వాళ్లని.. అందుకే కడపలో వైఎస్ ఫ్యామిలీ ఓటమి లేకుండా గెలుస్తోందని పౌరహక్కుల సంఘం ప్రచురించిన “కడప పాలెగాళ్లు” పుస్తకంలో స్పష్టంగా ఉంది. 1983 ఎలక్షన్‌లో ఎన్టీఆర్ ప్రభంజనంలో కూడా వైఎస్ గెలిచింది ఇలాగే అనేది పౌరహక్కుల సంఘం మాట. జనాన్ని అసలు ఓటు వేయనిస్తే గదా వేరే వాళ్లు గెలవడానికి అనేది ప్రధాన ఆరోపణ.
ఇక ఏపీ పీసీసీ అధ్యక్షునిగా 1984లో బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందనేది మరో మాట. విశాఖ నుండి వరంగల్ వరకు, విజయవాడ నుండి తిరుపతి వరకు ప్రతి ప్రాంతంలో రౌడీలను చేరదీసి ఖద్దర్ వేయించారని.. అందుకే సొసైటీలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌కు వైఎస్ ఆరాధ్యదైవం అనేది కడప పాలెగాళ్లు పుస్తకంలో మాట. అలాంటి వారికి ఏమైనా అయితే.. వెంటనే జగన్ అక్కడికి వెళ్లిపోతారు. అయితే ఈ విషయాన్ని సైకోలు మాత్రం.. నమ్మిన వాళ్ల కోసం వైఎస్ ఎంత దూరం అయినా వెళ్తారని.. జగన్ మాట తప్పడు.. మడమ తిప్పడూ అంటూ గొప్పగా చెప్తారు.
Also Read : ఆ కేసులో జగన్ ను పెద్దలు కాపాడతారా..?
తప్పు చేసిన వారికి న్యాయస్థానం శిక్ష విధిస్తే.. జైలుు వెళ్లి మరీ పరామర్శిస్తారు. వాస్తవానికి ప్రస్తుతం వైసీపీలో ఉన్న వైఎస్ఆర్ అభిమానుల్లో చాలా మంది నేరప్రవృతి కలిగిన వారే. వాళ్లపై ఎప్పటి నుంచో కేసులున్నాయి కూడా. అటు అనంతపురం నుంచి.. ఇటు శ్రీకాకుళం వరకు రాజకీయ నేతల ముసుగులో ఉన్న వైసీపీ నేతల్లో చాలా మంది మాజీ రౌడీలే. ప్రస్తుతం సీనియర్ నేతలుగా చెలామణి అవుతున్న వారిపై గతంలో రౌడీ షీట్లు ఉన్నాయి. ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న గౌరు వెంకటరెడ్డిని పరామర్శించేందుకు కర్నూలు జైలుకు వెళ్లారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన తర్వాత శిక్ష తగ్గిస్తూ ప్రత్యేక జీవో జారీ చేసి.. జైలు నుంచి గౌరు వెంకటరెడ్డిని వైఎస్ఆర్ బయటకు తీసుకువచ్చారు.
సేమ్ టూ సేమ్ ఇలాగే వ్యవహరిస్తున్నారు జగన్. పల్నాడు జిల్లా వినుకొండలో ఓ రౌడీషీటర్ హత్యకు గురైతే.. వెంటనే జగన్ అక్కడికి వెళ్లి పరామర్శించారు. ఇక ఈవీఎం ధ్వంసం చేసిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, గన్నవరంలో అక్రమలు, దౌర్జన్యాలు చేసిన వల్లభనేని వంశీని, అమరావతిలో ఒక గ్యాంగ్ నడిపించిన మాజీ ఎంపీ నందిగం సురేష్ వంటి నేతలను జగన్ జైలుకు వెళ్లి పరామర్శించారు. ఇక తాజాగా తెనాలి గంజాయి బ్యాచ్ కోసం కూడా ప్యాలెస్ నుంచి జగన్ బయటకు వచ్చాడనే టీడీపీ నేతల ఆరోపణ. గంజాయి మత్తులో ఎంతో మందిపై దాడికి తెగబడ్డారు. చివరికి కానిస్టేబుల్‌పై కూడా దాడి చేశారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో కోటింగ్ ఇచ్చారు. ఇలాంటి వారికి జగన్ అండగా ఉన్నారు ఇప్పుడు.
Also Read : జగన్ 2.0.. భయపడుతున్న జనం..!
చేతికి మట్టి అంటుకుండా… నేరం చేసి దాన్ని తమ మీద వేసుకుని జైల్లో కూర్చునే వాళ్లను జగన్ దగ్గరికి తీస్తున్నాడనేది బహిరంగ రహస్యం. ఎన్నికల సమయంలో ఇలాంటి వారే పార్టీకి అన్ని విధాలుగా అండగా ఉంటారని జగన్ బలంగా నమ్ముతారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోను ఇలాంటి వాళ్లను వైఎస్ కుటుంబం వదులుకోదు. వదులుకోలేదు కూడా. ఇక తాజాగా తెనాలి పర్యటన వెనుక భారీ కుట్ర ఉందనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. రాజధాని సమీపంలో అసాంఘిక శక్తులను చేరదీసి.. శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే చాలు. దీని వల్ల అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని పారిశ్రామిక వేత్తలను రాకుండా చేసే కుట్ర ఉందని కూడా అంటున్నారు. ఇక అధికారం కోసం 91లో హైదరాబాద్‌లో జరిగిన మారణ హోమం వెనుక వైఎస్ హస్తం ఉందనేది ఇప్పటికీ పీసీసీ నేతలు చేస్తున్న ఆరోపణ. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు చేయడం వైఎస్ ఫ్యామిలీకి వెన్నతో పెట్టిన విద్య అని కొందరు రాజకీయ నేతలు విమర్శలు చేస్తున్నారు కూడా.

