Wednesday, February 4, 2026 02:33 PM
Wednesday, February 4, 2026 02:33 PM

కర్ణాటక సీఎం కుర్చీ.. మల్లికార్జున ఖర్గే సీరియస్..

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అయ్యింది. దీంతో సీఎం పదవి నుంచి సిద్ధరామయ్యను మారుస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అటు కర్ణాటక కాంగ్రెస్ నాయకులు కూడా ఢిల్లీకి క్యూ కడుతున్నారు. దీంతో సీఎం మార్పు ఖాయమని కొందరు.. లేదు లేదు మంత్రివర్గ విస్తరణలో భాగంగానే కాంగ్రెస్ పెద్దలు మంతనాలు జరుపుతున్నారనే మాట కూడా వినిపిస్తోంది. ఇక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ 3 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేయడం కూడా సీఎం మార్పు అనే ప్రచారానికి మరింత ఊతం ఇస్తోంది.

Also Read : అవసరం వస్తే.. తిరిగి వస్తా..!

2023 జూన్‌లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరింది. ఆ సమయంలో సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ కూడా సీఎం రేసులో ఉన్నారు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం.. ఇద్దరు నేతల మధ్య రాజీ కుదుర్చింది. తొలి రెండున్నరేళ్లు సిద్ధరామయ్యను, తర్వాత రెండున్నరేళ్లు డీకే శివకుమార్‌కు అవకాశం ఉంటుందని హామీ ఇచ్చారు. అదే సమయంలో ఒప్పందంలో భాగంగా డీకేను డిప్యూటీ సీఎం చేశారు. అలాగే కర్ణాటక పీసీసీ అధ్యక్ష పదవి కూడా ఇచ్చారు. సరిగ్గా రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు సీఎం పదవి మార్పు అనే ప్రచారం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ పెద్దలు కూడా ఈ ప్రచారానికి అడ్డుకట్టు వేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు.

నిజానికి కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం కుర్చీ కోసం డీకేతో పాటుపలువురు సీనియర్లు పోటీ పడుతున్నారు. పార్టీ కోసం పని చేసే క్రమశిక్షణ కలిగిన సైనికుడిని నేనే అంటూ డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలను పలువురు సీనియర్ నేతలు తప్పుబడుతున్నారు. పార్టీ ఏ ఒక్కరి శ్రమతో పని చేయదని.. పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అన్ని వర్గాల నేతలు, అన్ని ప్రాంతాల కార్యకర్తలు శ్రమ ఫలితమే అని తేల్చేశారు. హోమ్ మంత్రి పరమేశ్వరన్, సతీశ్ జార్జిహొళి సహా పలువురు సీనియర్లు ఇప్పుడు సీఎం కుర్చీ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కర్ణాటక విషయంపై కాంగ్రెస్ పెద్దలు ఏం నిర్ణయం తీసుకుంటారో అని మీడియా వర్గాలు ఆసక్తిగా ఎదురు చూశారు.

Also Read : ఏపీ జనసేన చీఫ్ గా ఎంపీకి ఛాన్స్..? పవన్ కీలక నిర్ణయం..?

దీనిపై కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులుగా తన నివాసం వద్ద, కాంగ్రెస్ కార్యాలయం దగ్గరే ఎందుకున్నారని మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి సమస్య లేకుండా ఎందుకున్నారని నిలదీశారు. నేను ఏదైనా చెబితే.. అది మంచిది కాదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ జరుగుతున్న సంఘటనల గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఏమైనా జరిగినా, హైకమాండ్ దానినిపై నిర్ణయం తీసుకుంటుందని.. కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆందోళన చెందడం సరైనది కాదంటూ మల్లికార్జున ఖర్గే అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంతర్గత విషయాలు తప్ప.. మీకు మరో విషయం లేదా.. దేశంలో చాలా సమస్యలున్నాయి.. వాటిపైన దృష్టి పెడితే బాగుంటుంది కదా అని ఖర్గే వ్యాఖ్యానించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్