తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఆసక్తి రేపిన జూబ్లిహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో సెంటిమెంట్ కంటిన్యూ అవుతోంది. అధికార పార్టీలు ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తాయనే సాంప్రదాయం ఇక్కడ కూడా కొనసాగే సంకేతాలు కనపడుతున్నాయి. జూబ్లిహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. పోస్టల్ బ్యాలెట్ మొదలు అన్ని రౌండ్లలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా 3 రౌండ్లలో కాంగ్రెస్ ఆధిక్యంలోకి వచ్చింది.
Also Read : రాహుల్ ఓటు బాంబు రెడీ..? అందుకే సైలెంట్ గా ఉన్నారా..?
తొలి రౌండ్లో కాంగ్రెస్ – 8,926 ఓట్లు, బీఆర్ఎస్ -8,864 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్లో 47 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉండగా.. రెండవ రౌండ్ లో కాంగ్రెస్-9,691 ఓట్లు, బీఆర్ఎస్ – 8,609 ఓట్లు పడ్డాయి. రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి బీజేపీకి – 317 ఓట్లు రావడం గమనార్హం. రెండో రౌండ్ పూర్తయ్యే సరికి 2216 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉండగా మూడవ రౌండ్ లో సైతం కాంగ్రెస్ తన డామినేషన్ కంటిన్యూ చేసింది. మొత్తం కలిపి 3,400 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ నిలిచింది.
Also Read : ఆపరేషన్ అరణ్య.. రంగంలోకి పవన్..!
నాలుగవ రౌండ్ లో కాంగ్రెస్ 9 వేలకు పైగా ఆధిక్యంలో నిలవగా.. 5వ రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ దాదాపు 13 వేల ఓట్ల ఆధిక్యంలో నిలిచింది. ఇప్పటి వరకు పూర్తైన అన్ని డివిజన్ల ఓట్లలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. ముస్లిం సామాజిక వర్గాల ఓట్లు ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ అందరూ ఊహించిన విధంగానే ఆధిక్యంలో నిలిచింది. దీనితో బీఆర్ఎస్ కోటగా చెప్తున్న జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ పాగా వేసింది. 2014లో ఇక్కడ టీడీపీ విజయం సాధించగా.. ఆ తర్వాత మాగంటి గోపీనాథ్ పార్టీ మారారు. ఆ తర్వాత 2018, 2023 లో బీఆర్ఎస్ విజయం సాధించింది.

