సస్పెన్షన్‌కు గురైన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుపై సీబీఐ దర్యాప్తునకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. “దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం నన్ను సస్పెండ్ చేశారు. మంచిదే.. మరి సమ న్యాయం కోసం రఘురామ కృష్ణరాజును అన్ని పదవుల నుండి సస్పెండ్ చేయాలి.” అని వ్యాఖ్యానించారు. నిజానికి ఈ కామెంట్ చేసే ముందు సునీల్ కుమార్ ఏం ఆలోచించారో తెలియదు కానీ.. ట్వీట్ చేసిన తర్వాత మాత్రం.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైపు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా చెప్పాలంటే.. సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు నేరుగా జగన్‌ను ఉద్దేశించినవే అనే మాట కూడా వినిపిస్తోంది.
Also Read : ప్రపంచస్థాయిలో ఉత్తరాంధ్రకు గుర్తింపు..!
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏపీ సీఐడీ చీఫ్ పదవిలో ఉన్న పీవీ సునీల్ కుమార్ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజును కస్టడీలోకి తీసుకుని హింసించారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై ఇప్పటికే రఘురామ కృష్ణరాజు నాటి లోక్ సభ స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. సునీల్ కుమార్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో విచారణను ప్రభావితం చేయకుండా ఉండేందుకు సునీల్ కుమార్‌పై కూటమి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. సుమార్ ఏడాదిన్నర కాలంగా ఆయన సస్పెన్షన్‌లోనే ఉన్నారు. వచ్చే ఏడాది జూన్ నెలాఖరు నాటికి పదవీ విరమణ చేయనున్న సునీల్ కుమార్ ఆ తర్వాత రాజకీయ పార్టీ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు కూడా ఇటీవల ఆయన సన్నిహితులు తెలిపారు. ఇటీవల సునీల్ కుమార్ సైతం రాజకీయాల గురించే ఎక్కువగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా విచారణ అధికారి ఎదుట కూడా సునీల్ కుమార్ హాజరయ్యారు.
Also Read : పాపం నిధీ.. రాజాసాబ్ హీరోయిన్ కు చుక్కలు..!
ఈ నేపథ్యంలో రఘురామను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో సునీల్ కుమార్ చేసిన ట్వీట్ వివాదాస్పదమవుతోంది. రఘురామపై ప్రస్తుతం ఉన్నది ఒకటే సీబీఐ కేసు. ఈ కేసులో దర్యాప్తు ఇప్పుడు ప్రారంభం కావాల్సి ఉంది. అయినా సరే రఘురామను అన్ని పదవుల నుంచి తొలగించాలని సునీల్ కుమార్ కోరుతున్నారు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క కేసు ఉన్న రఘురామను తొలగించాలని అడుగుతున్నారు.. మరి 11 సీబీఐ కేసులు ఉన్నా కూడా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగారు.. ఆయనను ఎందుకు పదవి నుంచి తప్పుకోవాలని అడగలేదని నిలదీస్తున్నారు. ఇదే సమయంలో విచారణ సమయంలో తనకు సరిగా గుర్తు లేదు అని సునీల్ కుమార్ చెప్పినట్లు వచ్చిన వార్తలను ప్రస్తావిస్తున్న టీడీపీ అభిమానులు.. మూడేళ్ల క్రితం జరిగినవి గుర్తు లేదు.. మర్చిపోయారు.. కానీ.. ఎప్పుడో చదువుకున్న రూల్స్ మాత్రం బాగా గుర్తున్నాయ్ ఇంకా.. ఇదే కదా మ్యాజిక్కు అని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి పీవీ సునీల్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు.. ఇప్పుడు జగన్‌ను టార్గెట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

