Sunday, March 22, 2026 06:11 PM
Sunday, March 22, 2026 06:11 PM

ఛావా ఎఫెక్ట్.. మహారాష్ట్ర పోలీసులకు కొత్త ప్రాబ్లం

బాలీవుడ్ యంగ్ హీరో.. విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా వచ్చిన చారిత్రాత్మక చిత్రం ఛావా ఇంకా ఉత్తరాదిలో రికార్డులు బ్రేక్ చేస్తూనే ఉంది. చత్రపతి శివాజీ కుమారుడు శంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమాకు.. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను స్థానిక భాషల్లో డబ్బింగ్ చేయగా.. ఊహించినంత రెస్పాన్స్ రాలేదు. ముఖ్యంగా మన తెలుగులో సినిమాకు నష్టాలే వచ్చాయి అనే వార్తలు కూడా వస్తున్నాయి.

Also Read : పవన్ టార్గెట్ అదే.. అందుకే తేనె తుట్టును కదిపారా…?

ఇక ఈ సినిమాతో ఔరంగజేబు ఎంత క్రూరడు అనేది అర్థమైందంటూ హిందుత్వవాదులు, దేశభక్తులు సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇదే టైంలో ఒక డిమాండ్ విశ్వహిందూ పరిషత్ బయటకు తీసింది. శంబాజీ మహారాజును హింసించి చంపిన ఔరంగజేబు సమాధిని.. కూల్చివేయాలని, అతని సమాధి అక్కడ లేకుండా చేయాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. దీనితో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

Also Read : రాజమౌళి – మహేష్ మూవీ లీక్.. టెక్నీషియన్ కు భారీ జరిమానా

మహారాష్ట్ర పోలీసులు శంభాజీ నగర్ లో ఉన్న ఔరంగజేబు సమాధి వద్ద భారీ భద్రతను పెంచారు. సమాధి వద్దకు ఎవరైనా వెళ్లి సందర్శించాలంటే.. ఖచ్చితంగా తమ గుర్తింపు పత్రాలను ఇవ్వడంతో పాటుగా.. అక్కడున్న రిజిస్టర్లో సంతకం చేయాల్సి ఉంటుంది. ఇలా భద్రతను పెద్ద ఎత్తున కట్టుదిట్టం చేసింది మహారాష్ట్ర పోలీస్ విభాగం. ఔరంగజేబు సమాధి.. పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అల్లర్లు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. అటు మత కలహాలు కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మసీదులు అలాగే దేవాలయాల వద్ద భద్రతను పెంచారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్